మక్కా రక్త సిక్తం.. సౌదీలో ఘోర ప్రమాదం.. 35 మంది మృతి

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 35 మంది విదేశీయులు మరణించారు. పలువురు గాయపడ్డారు. ముస్లిముల పవిత్ర నగరం మక్కా వద్ద ఓ ప్రయివేటు బస్సు భారీ ట్రక్కును ఢీ కొనడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది. మృతుల్లో చాలామంది అరబ్బులు, ముస్లిములేనని అధికారులు తెలిపారు. ఈ యాత్రికులంతా మక్కా వెళ్తుండగా జరిగిన ఈ ఘటనలో.. బస్సు మంటల్లో మండుతూ.. బస్సు తలుపులు పేలిపోయాయి. కొందరు ఈ భీకర దృశ్యాలను తమ ఫేస్ బుక్ లో పోస్ట్ […]

  • Anil kumar poka
  • Publish Date - 12:13 pm, Thu, 17 October 19
మక్కా రక్త సిక్తం.. సౌదీలో ఘోర ప్రమాదం.. 35 మంది మృతి

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 35 మంది విదేశీయులు మరణించారు. పలువురు గాయపడ్డారు. ముస్లిముల పవిత్ర నగరం మక్కా వద్ద ఓ ప్రయివేటు బస్సు భారీ ట్రక్కును ఢీ కొనడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది. మృతుల్లో చాలామంది అరబ్బులు, ముస్లిములేనని అధికారులు తెలిపారు. ఈ యాత్రికులంతా మక్కా వెళ్తుండగా జరిగిన ఈ ఘటనలో.. బస్సు మంటల్లో మండుతూ.. బస్సు తలుపులు పేలిపోయాయి. కొందరు ఈ భీకర దృశ్యాలను తమ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. క్షతగాత్రులను అధికారులు సమీప ఆసుపత్రులకు తరలించారు. గత ఏడాది ఏప్రిల్ లో ఒక బస్సు ఇంధన ట్రక్కును ఢీ కొనడంతో నలుగురు బ్రిటిష్ యాత్రికులు మృతి చెందగా 12 మంది గాయపడ్డారు. వారంతా మక్కా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 2015 సెప్టెంబరులో మక్కా వద్దే జరిగిన తొక్కిసలాటలో రెండున్నర వేలమందికి పైగా మృత్యువాత పడ్డారు. వీరిలో చాలామంది ఇరానియన్లు ఉన్నారు. కాగా- తాజాగా జరిగిన ప్రమాదానికి బస్సు అతివేగంగా ప్రయాణించడమే కారణమని భావిస్తున్నారు.

ప్రధాని మోదీ సంతాపం:

సౌదీలో మదీనా వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 35 మంది మరణించిన ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలంటూ ఆయన ట్వీట్ చేశారు. అటు-విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జయశంకర్ కూడా సంతాపం ప్రకటించారు. ఈ దారుణ ప్రమాదంలో మృతి చెందిన, లేదా గాయపడిన భారతీయులెవరైనా ఉన్నారా అన్న వివరాలను కనుగొనాల్సిందిగా జెడ్డాలోని భారత దౌత్య కార్యాలయాన్ని కోరినట్టు ఆయన పేర్కొన్నారు. సాధారణంగా మక్కాకు భారతీయ యాత్రికులు కూడా పెద్ద సంఖ్యలో వెళ్తుంటారు.