‘ఒక పంతులుకు ఇంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది’ ఆకట్టుకుంటోన్న విజయ్ మాస్టర్’ తెలుగు టీజర్..
తమిళ స్టార్ హీరోలు దళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మాస్టర్’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న..
Master Teaser: తమిళ స్టార్ హీరోలు దళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మాస్టర్’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మాములుగా విజయ్ మూవీ అంటేనే ఫ్యాన్స్‌లో క్రేజ్ విపరీతంగా ఉంటుంది. అలాంటిది ఈ చిత్రంలో విజయ్‌తో పాటు విజయ్ సేతుపతి కూడా స్క్రీన్ షేర్ చేసుకోవడంతో అటు కోలీవుడ్ ఇండస్ట్రీ.. ఇటు ఫ్యాన్స్‌లో ఎక్స్‌పెటేషన్స్ పీక్స్‌కు చేరుకున్నాయి.
ఇదిలా ఉంటే కొద్దిసేపటి క్రితం చిత్ర యూనిట్ సినిమాకు సంబంధించిన తెలుగు టీజర్‌ను విడుదల చేశారు.’అది నాకూ తెలుసు సర్. జేడీ ఒక నేరస్థుడు. ఒక పంతులుకు ఇంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది’ అంటూ ప్రారంభమైన ఈ టీజర్ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. పక్కా మాస్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్, విజయ్ సేతుపతి మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్స్‌లు ఇద్దరి హీరోల ఫ్యాన్స్‌కు విపరీతంగా ఆకట్టుకోనున్నాయి. కాగా, ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తుండగా.. మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో ఈ సినిమాకు ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ అధినేత మహేష్ కోనేరు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తున్నారు.