Threema App: సమాచార భద్రత కోసం ఉగ్రవాదులు ఉపయోగిస్తోన్న యాప్‌ ఏంటో తెలుసా.? సంచలన విషయం చెప్పిన ఎన్‌ఐఎ..

Threema App: సమాచార భద్రత కోసం ఉగ్రవాదులు ఉపయోగిస్తోన్న యాప్‌ ఏంటో తెలుసా.? సంచలన విషయం చెప్పిన ఎన్‌ఐఎ..

Terrorist Use Threema App: వాట్సాప్‌ డేటా ప్రైవసీ అంశం తెరపైకి రావడంతో అందరూ సమాచార భద్రత విషయంపై ఆలోచిస్తున్నారు. మనం ఇతరులతో మాట్లాడుతోంది, పంపించుకుంటోన్న మెసేజ్‌లు..

Narender Vaitla

|

Jan 16, 2021 | 5:45 AM

Terrorist Use Threema App: వాట్సాప్‌ డేటా ప్రైవసీ అంశం తెరపైకి రావడంతో అందరూ సమాచార భద్రత విషయంపై ఆలోచిస్తున్నారు. మనం ఇతరులతో మాట్లాడుతోంది, పంపించుకుంటోన్న మెసేజ్‌లు వేరేవారికి తెలిసిపోతే ఎలా అనే ప్రశ్నలు యూజర్లలో తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో టెలిగ్రామ్‌, సిగ్నల్‌ వంటి యాప్‌లవైపు మొగ్గు చూపుతున్నారు. ఇదిలా ఉంటే మరి ఉగ్రవాదులు పోలీసులకు చిక్కకుండా సమాచార మార్పిడి ఎలా చేసుకుంటారు. వారు టెక్నాలజీ ఎలా ఉపయోగిస్తారు.. ఎప్పుడైనా ఆలోచించారా.? ఈ క్రమంలోనే తాజాగా నేషనల్‌ ఇన్వెస్టిగేటింగ్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఉగ్రవాదులు సమాచార భద్రతపరంగా అత్యంత పటిష్టమైన ‘త్రీమా’ యాప్‌ను వాడుతున్నట్లు ఎన్‌ఐఏ విచారణలో తేలింది. సుదూర దూరాల్లో ఉండే ఉగ్రవాదులు ఈ యాప్‌ ద్వారానే సమాచారం పంపిస్తున్నట్లు గుర్తించారు. ఐసిస్‌ ఉగ్రవాదులు జహాన్‌జైబ్‌ వనీ, అతని భార్య హీనా బేగ్‌, బెంగళూరుకు చెందిన అబ్దుర్‌ రెహమాన్‌లను ప్రశ్నిస్తున్న సమయంలో ఈ విషయం తెలిసిందని ఎన్‌ఐఏ పేర్కొంది. త్రీమా యాప్‌ నుంచి పంపే మెసేజ్‌లు, కాల్స్‌ను ట్రాక్‌ చేయడం అంత సులభమైన విషయం కాదు. స్విట్జర్లాండ్‌కు చెందిన ఈ యాప్‌ ద్వారా జరిగే సమాచారం సర్వర్‌కు బదులుగా ఫోన్లలోనే సేవ్‌ అవుతుంది.

Also Read: Warplanes Rajnath Singh: యుద్ధ విమానాల కొనుగోలుతో 50 వేల ఉద్యోగాలు: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu