TS 10th Result 2021 Date : రేపే టెన్త్ ఫలితాలు.. ఫార్మటివ్ అస్సెస్మెంట్ ఆధారంగా గ్రేడింగ్స్..
Telangana 10th Class Results: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
Telangana 10th Class Results Date: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫార్మటివ్ అస్సెస్మెంట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్స్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కాగా, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల తెరుచుకున్న విద్యా సంస్థలు.. ప్రభుత్వ ఆదేశాలతో మరోసారి మూతబడ్డ సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే బడులు మూతపడడంతో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించారు. కానీ, వైరస్ విజృంభిస్తున్న సమయంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించడం మేలు కాదని భావించిన ప్రభుత్వం ఎగ్జామ్స్‌ను రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే ఫార్మటివ్ అస్సెస్మెంట్ విధానంలో పాస్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.
కోవిడ్ కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు హాల్ టికెట్ నంబర్లు కేటాయించింది. మార్కుల మెమోలో హాల్‌టికెట్ నంబర్‌ను కూడా నమోదు చేస్తారు. గత సంవత్సరం నాలుగు ఎఫ్‌ఏ పరీక్షల సగటు ఆధారంగా పదో తరగతి పరీక్ష ఫలితాలు ప్రకటించగా, ఈసారి మాత్రం ఒక్క ఎఫ్‌ఏ ఆధారంగానే వార్షిక పరీక్ష మార్కులు కేటాయించనున్నారు. ఫలితాలు వెలువడిన తర్వాత నెలాఖరులోగా మెమోలు విడుదల చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం భావిస్తున్నట్లు తెలుస్తోంది.