NTR 31 Movie : ప్రశాంత్ నీల్- తారక్ మైత్రి.. ఎన్టీఆర్ 31 పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్ .. ఫ్యాన్స్ ను పండగే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
NTR 31 Movie :
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మరో హీరోగా నటిస్తున్నాడు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుంటే తారక్ గిరిజన వీరుడు కొమురం భీమ్ గా కనిపించనున్నాడు. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు వీరులను కలిపి సినిమాగా చూపించనున్నాడు జక్కన. ఇక ఈ సినిమానుంచి ఇప్పటికే టీజర్లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. నేడు తారక్ పుట్టిన రోజు సందర్భంగా కొమురం భీమ్ లుక్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్. ఈ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న తారక్ ఇటీవల కరోనా బారిన పడటంతో చిన్న బ్రేక్ ఇచ్చారు. ఈ సినిమా పూర్తయిన తరవాత కొరటాల శివ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు తారక్. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు కలిసి నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు తారక్ మరో క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నాడు
కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా చేయనున్నాడు. నిజానికి ఈ కాంబోలో సినిమారబోతుందని వార్తలు వచ్చినప్పటికీ ఎలాంటి క్లారిటీ రాలేదు. నేడు తారక్ పుట్టిన రోజు సందర్భంగా ఈ న్యూస్ పై క్లారిటీ వచ్చింది. ప్రశాంత్ తో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడని స్పష్టమైంది. ఎన్టీఆర్ 31వ సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే ఉంటుందని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. మరచిపోలేని ప్రయాణంలో ఇద్దరు బలవంతులు జత కలిశారంటూ ట్వీట్ చేసింది మైత్రి మూవీ మేకర్స్.
మరిన్ని ఇక్కడ చదవండి :