Ranveer Singh: డైలమాలో బాలీవుడ్ హీరో.. శంకర్ తో సినిమాపై క్లారిటీ తీసుకోనున్న రణ్ వీర్ సింగ్..

రామ్ చరణ్ లాగే.. బాలీవుడ్ క్రేజీ హీరో ఒకరు "నాకు కూడా క్లారిటీ కావాలని" అంటున్నారట. క్లారిటీ లేనిదే.. కమిట్మెంట్‌ లేదని తెగేసి చెబుతున్నారట.

Ranveer Singh: డైలమాలో బాలీవుడ్ హీరో.. శంకర్ తో సినిమాపై క్లారిటీ తీసుకోనున్న రణ్ వీర్ సింగ్..
Ranveer Singh
Follow us
Rajeev Rayala

|

Updated on: May 20, 2021 | 1:01 PM

Ranveer Singh:

రామ్ చరణ్ లాగే.. బాలీవుడ్ క్రేజీ హీరో ఒకరు “నాకు కూడా క్లారిటీ కావాలని” అంటున్నారట. క్లారిటీ లేనిదే.. కమిట్మెంట్‌ లేదని తెగేసి చెబుతున్నారట. ఒకవేళ కాదు కూడదంటే.. తన దారి తాను చూసుకుంటా అంటూ.. సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారట. ఇంతకీ ఆ హీరో ఎవరు.. ఏంటా కథా కమామిషు అని అనుకుంటున్నారు కదూ..!  కమల్‌ హాసన్‌ హీరోగా మొదలెట్టిన “ఇండియన్‌ 2” సినిమా… ప్రొడక్షన్ హౌస్‌తో ఉన్న విభేదాల కారణంగా ఆగిపోవడంతో.. డైరెక్టర్‌ శంకర్‌ ఇటు తెలుగులోనూ.. అటు హిందీలోనూ.. రెండు ప్రాజెక్ట్‌లను గ్రాండ్‌గా అనౌన్స్‌ చేశారు. తెలుగులో రామ్ చరణ్‌ హీరోగా దిల్ రాజు బ్యానర్‌లో పాన్ ఇండియా మూవీని అనౌన్స్‌ చేయగా…. హిందీలో రణ్‌వీర్ సింగ్‌ హీరోగా “అన్నియన్‌”కి సీక్వెల్ తెరకెక్కించనున్నట్టు శంకర్‌ ప్రకటించారు.

అయితే ఆ తరువాత ఇండియన్‌ 2 సినిమాను నిర్మిస్తున్న ప్రొడక్షన్‌ హౌజ్‌ లైకా….. డైరెక్టర్‌ శంకర్‌తో ఉన్న విభేదాల పరిష్కారానికి కోర్టు మెట్లక్కడం.. ఇండియన్‌ 2 ను పూర్తి చేసే వరకు మరే సినిమాకు పనిచేయకూడదంటూ… తెలుగు, హిందీ ఫిల్మ్‌ చాంబర్లకు లెటర్లు రాయడం చకచకా జరిగిపోయాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఇంతవరకు ఈ విషయం పై శంకర్‌ స్పందించకపోవడం.. కాని.. క్లారిటీ ఇవ్వడం కాని చేయలేదు. దీంతో ఇటీవల రామ్ చరణ్.. దిల్ రాజుకు ఫోన్ చేసి శంకర్‌ నుంచి సినిమాపై క్లారిటీ తీసుకోవాలని కోరారట. ఇదే క్రమంలో బాలీవుడ్‌ మాచో మ్యాన్‌ రణ్‌ వీర్‌ సింగ్‌ కూడా తొందర్లో శంకర్‌ను కలిసి “అన్నియన్‌” రిమేక్‌ విషయంలో క్లారిటీ తీసుకోవాలని అనుకుంటున్నారట. ఒకవేళ క్లారిటీ ఇవ్వని పక్షంలో మరో సినిమాను మొదలుపెట్టారని భావిస్తున్నారట. ఇప్పుడిదే విషయం అటు బాలీవుడ్లోనూ… ఇటు సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది.

మరిన్ని ఇక్కడ చదవండి :

NTR Birthday RRR Look : ఆర్ఆర్ఆర్ నుంచి యంగ్ టైగర్ లుక్ .. కొమురం భీమ్ గా అదరగొట్టిన తారక్

Happy Birthday Jr NTR: యంగ్ టైగర్ – కొరటాల సినిమా … స్లిమ్ అండ్ హ్యాండ్సమ్ లుక్ లో అదరగొట్టిన తారక్..