Priyadarshi Pulikonda: మరో విభిన్న కథతో రానున్న ప్రియదర్శి.. ఆకట్టుకుంటున్న పోస్టర్

"నా చావు నేను చస్తా" అంటూ.. అందర్నీ నవ్వించిన ప్రియదర్శి ఇప్పుడు మనల్ని భయపెట్టబోతున్నారు. ఎప్పుడూ నవ్వించడమేనా.. అని అనుకున్నాడో

Priyadarshi Pulikonda: మరో విభిన్న కథతో రానున్న ప్రియదర్శి.. ఆకట్టుకుంటున్న పోస్టర్
Priyadarshi
Follow us
Rajeev Rayala

|

Updated on: May 20, 2021 | 12:19 PM

Priyadarshi Pulikonda:

“నా చావు నేను చస్తా” అంటూ.. అందర్నీ నవ్వించిన ప్రియదర్శి ఇప్పుడు మనల్ని భయపెట్టబోతున్నారు. ఎప్పుడూ నవ్వించడమేనా.. అని అనుకున్నాడో ఏమో గాని.. ఇప్పుడు మరోలా ఓ వెబ్‌ సిరీస్‌తో మన ముందుకు వస్తున్నారు. నిన్న మొన్నటి వరకు “కంబాల కథలు” అంటూ.. తన ఇన్‌సెంట్ యాక్టింగ్‌తో అందర్నీ నవ్వించిన ప్రియదర్శి… ఇప్పుడు ఓ క్రైమ్ థిల్లర్‌ కథాంశంతో మన ముందుకు రాబోతున్నారు. నందినిరాయ్ నాయిక‌. విద్యాసాగ‌ర్ ముత్తుకుమార్ దర్శకత్వంలో “ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌” వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. 100పర్సెంట్ తెలుగు ఓటీటీ ఆహా స్ట్రీమ్ కాబోతున్న ఈ ఓటీటీ సంబంధించిన ఫస్ట్ లుక్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

ఈ ఫస్ట్ లుక్‌లో ప్రియదర్మి సిగ‌రెట్ వెలిగిస్తూ సీరియ‌స్ లుక్‌లో ద‌ర్శ‌న‌వ్వగా… నందిని రాయ్ భ‌య‌ప‌డుతూ క‌నిపించింది. ఫుల్‌ ఫైరీ ఎఫెక్ట్తో సీరియస్‌ లుక్‌ లో డిజైన్ చేసిన ఈ ఫస్ట్ లుక్‌ ఇప్పుడు సోషల్‌ మీడియోలో అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ గా మారింది.ఇక క్రైమ్ థ్రిల్ల‌ర్ ను సురేశ్ కృష్ణ సంస్థ నిర్మిస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Prabhas’s Salaar: పాన్ ఇండియా ప్రభాస్ సినిమాలో కీలక పాత్రలో అందాల చంద్రముఖి.. ఏ పాత్రలో అంటే..

Mahesh Babu and Trivikram: మహేష్ బాబు సినిమాకోసం భారీ సెట్స్ వేయిస్తున్న గురూజీ..

NTR Birthday RRR Look : ఆర్ఆర్ఆర్ నుంచి యంగ్ టైగర్ లుక్ .. కొమురం భీమ్ గా అదరగొట్టిన తారక్