బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. తెలుగును అధికార భాషగా ఆమోదిస్తూ నిర్ణయం.. ఇప్పటికే 10కిపైగా అధికార భాషలు
పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలుగు భాషను అధికార భాషగా హోదా ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జరిగిన కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం...
పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలుగు భాషను అధికార భాషగా హోదా ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జరిగిన కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం తెలిపింది. తెలుగు భాషను అధికార భాషగా ప్రకటించాలని బెంగాల్ లోని తెలుగు ప్రజలు గత కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం తెలుగు భాషను అధికార భాషగా అధికార భాషగా ఆమోదించింది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ లో పదికిపైగా అధికార భాషలున్నాయి. కాగా, బెంగాల్ లో ఖరగ్ పూర్ ప్రాంతంలో తెలుగు ప్రజలు అధికంగా ఉన్నారు. దీంతో తెలుగు భాషపై డిమాండ్ పెరగడంతో మమతా సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఓట్లు రాబట్టేందుకే..
కాగా, వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మినీ ఆంధ్రాగా పేరున్న ఖరగ్‌పూర్‌లోని తెలుగు ప్రజలను ఆకర్షించి ఓట్లు రాబట్టేందుకు మమతా సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రైల్వే ఉద్యోగాల కోసం ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్లి అక్కడే స్థిరపడిన వేలాది మంది తెలుగువారు అక్కడి రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఖరగ్‌పూర్ బల్దియాలో ఉన్న 35 వార్డుల్లో ఆరు చోట్ల తెలుగు వారు కౌన్సిలర్లుగా పని చేస్తున్నారు. అలాగే వివిధ పార్టీల్లోనూ ముఖ్య స్థానాల్లో కొనసాగుతున్నారు.
అయితే చాలా కాలంగా తెలుగుకు అధికార భాష హోదా కల్పించాలని డిమాండ్ ఉండటంతో.. మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది మమతా మమతా సర్కర్. ఈ మేరకు కేబినెట్ నిర్ణయాన్ని బెంగాల్ విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీ మీడియాకు వెల్లడించారు. హిందీ, ఉర్దూ, నేపాలీ, గురుముఖి, ఒడియా తదితర భాషలకు ఇప్పటికే అధికార భాష హోదా ఇచ్చింది. తెలుగుకు ప్రాధాన్యత కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడంతో తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మమత కేబినెట్ మీట్ నుంచి నలుగురు మంత్రులు ‘మిస్సింగ్’ ! బీజేపీ లోకి జంప్ అవుతారా ? తృణమూల్ కి షాక్ !