మమత కేబినెట్ మీట్ నుంచి నలుగురు మంత్రులు ‘మిస్సింగ్’ ! బీజేపీ లోకి జంప్ అవుతారా ? తృణమూల్ కి షాక్ !

పశ్చిమ బెంగాల్ లో సీఎం మమతా బెనర్జీ నేతృత్వం లోని పాలక తృణమూల్ కాంగ్రెస్ కి గడ్డు రోజులు దగ్గర పడుతున్నట్టు కనిపిస్తోంది. నిన్న దీదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశానికి నలుగురు మంత్రులు  గైర్ హాజరయ్యారు.

మమత కేబినెట్ మీట్ నుంచి నలుగురు మంత్రులు 'మిస్సింగ్' ! బీజేపీ లోకి జంప్ అవుతారా ? తృణమూల్ కి షాక్ !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 23, 2020 | 6:47 AM

పశ్చిమ బెంగాల్ లో సీఎం మమతా బెనర్జీ నేతృత్వం లోని పాలక తృణమూల్ కాంగ్రెస్ కి గడ్డు రోజులు దగ్గర పడుతున్నట్టు కనిపిస్తోంది. నిన్న దీదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశానికి నలుగురు మంత్రులు  గైర్ హాజరయ్యారు. వీరిలో ముగ్గురు తాము ఎందుకు రాలేకపోయామో ఆ తరువాత వివరణ ఇచ్చుకున్నారు. కానీ నాలుగో మంత్రి అటవీ శాఖామాత్యులు రాజీబ్ బెనర్జీ మాత్రం రాత్రి పొద్దుపోయేంతవరకు అజాపజా లేకపోయారు. గత కొన్ని రోజులుగా ఆయన వ్యవహార శైలి కాస్త అనుమానాస్పదంగా ఉంటూనే వస్తోంది. డోమ్ దూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన ఆయన ఆ మధ్య కోల్ కతా లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..పార్టీలో ‘ఎస్ మెన్’ ప్రాబల్యం, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం పెరిగిపోతున్నాయని ఆరోపించారు. ఇటీవలే తృణమూల్ నుంచి బీజేపీలో చేరిన సువెందు అధికారి కూడా తను తృణమూల్ లో ఉన్నప్పుడు ఇలాంటి మాటలే అన్నారు. వాటినే రాజీబ్ కూడా ప్రస్తావించారు. ఇక దీంతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగి ఈయనతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో రాజీబ్ మెత్తగానే మాట్లాడినట్ట్టు కనిపించింది. పార్టీలో కొంతమంది వైఖరికి తాను నొచ్చుకున్నాను తప్ప మరీ పెద్దగా అసంతృప్తి లేదని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది.

ఏమైనా నిన్నటి కేబినెట్ సమావేశానికి ఆయన డుమ్మా కొట్టడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇక రవీంద్ర నాథ్ ఘోష్, గౌతమ్ దేవ్, చంద్రనాథ్ సిన్హా అనే ముగ్గురు మంత్రులు మాత్రం తమ గైర్ హాజరీకి వివరణ ఇచ్చుకున్నారు. ఏమైనప్పటికీ సువెందు అధికారి పార్టీలో పెట్టిన ‘పొగ’ మెల్లగా రాజుకున్నట్టే కనిపిస్తోంది. అటు బీజేపీ కూడా ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తోంది. ఎవరెవరు తమ పార్టీలోకి జంప్ అవుతారా అని కమలనాథులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.