2013లో అదుర్స్ షో మొదటి సారి హోస్ట్ గా చేసింది శ్రీముఖి. ఈ షో సీజన్ 2 అదుర్స్ 2 షోకి కూడా హోస్ట్ చేసింది.
2014లో మనీ మనీ అనే ఓ రియాలిటీ షోకి; 2015లో సూపర్ మామ్, ఈటీవీ హిట్ షో పటాస్ లో రవితో హోస్ట్ గా చేసింది.
2016లో సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్, బలే ఛాన్స్ లే; 2017లో సూపర్ సింగర్ 9, జీ సరిహగమప షోలకి యాంకర్ గా వ్యవహరించింది ఈ బ్యూటీ.
2018లో జూలకటక, జూలకటక డబుల్ డోస్, కామెడీ నైట్స్, జీ సరేగమప లిటిల్ చాంప్స్, గోల్డ్ రష్ షోలకి హోస్ట్ చేసింది.
2019లో నుంచి ఇప్పట్టికి కొనసాగుతున్న స్టార్ట్ మ్యూజిక్ రీలోడెడ్ అనే షోని హోస్ట్ చేస్తుంది ఈ వయ్యారి.
2020 నుంచి సెలబ్రిటీ కబడ్డీ లీగ్ స్పోర్ట్ కి, బొమ్మ అదిరింది అనే ఓ సెలబ్రిటీ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తోంది.
2021 కామెడీ స్టార్స్, జీ మహోత్సవం, శ్రావణమాసం వచ్చిందమ్మా, అల బృందావనంలో, స్వామి వారి అంబరాలు, చెఫ్ మంత్ర షోలు హోస్ట్ చేసింది.
2022 సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్ చేయక ప్రస్తుతం డ్యాన్స్ ఐకాన్ సహ యజమానిగా, స్టార్ మా పరివారం హోస్ట్‌తో ఆదివారం, మిస్టర్ అండ్ మిస్సెస్, సారంగ దరియా షోస్ హోస్ట్ చేస్తుంది.
2023 సూపర్ సింగర్ 3 (తెలుగు) అనే ఓ సంగీతనికి సంబందించిన షోకి ఓ ప్రముఖ ఛానల్ లో హోస్ట్ గా వ్యవహరించింది.