AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా ప్రతినిధుల సభలో పోటీకి తెలుగుబిడ్డ సిధ్ధం

అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు  ఈ నెల 3 న జరగనున్నాయి. ఈ పదవికి పోటీ పడుతున్న అధ్యక్షుడు ట్రంప్, ఆయన ప్రత్యర్థి, డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ తమ ప్రచార హోరును పెంచగా .. వర్జీనియా లోని 15వ జిల్లా నుంచి ప్రతినిధుల సభకు తెలుగు బిడ్ద మంగ అనంతాత్ముల రిపబ్లికన్ గా పోటీ చేస్తున్నారు. ఈ రాష్ట్రం నుంచి బరిలోకి దిగిన ఈమె తొలిసారిగా సెనెటర్ అయ్యేందుకు తహతహలాడుతున్నారు. అమెరికాలో  స్వేచ్ఛ, ఫ్రీ మార్కెట్ […]

అమెరికా ప్రతినిధుల సభలో పోటీకి తెలుగుబిడ్డ సిధ్ధం
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 31, 2020 | 3:28 PM

Share

అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు  ఈ నెల 3 న జరగనున్నాయి. ఈ పదవికి పోటీ పడుతున్న అధ్యక్షుడు ట్రంప్, ఆయన ప్రత్యర్థి, డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ తమ ప్రచార హోరును పెంచగా .. వర్జీనియా లోని 15వ జిల్లా నుంచి ప్రతినిధుల సభకు తెలుగు బిడ్ద మంగ అనంతాత్ముల రిపబ్లికన్ గా పోటీ చేస్తున్నారు. ఈ రాష్ట్రం నుంచి బరిలోకి దిగిన ఈమె తొలిసారిగా సెనెటర్ అయ్యేందుకు తహతహలాడుతున్నారు. అమెరికాలో  స్వేచ్ఛ, ఫ్రీ మార్కెట్ ఉంటుంది గనుక ఈ దేశానికి వచ్చానని, కానీ ఇప్పుడీ ధోరణి మారిపోయిందని ఆమె అంటున్నారు. ఈ ఎన్నికల్లో రాజ్యాంగ హక్కుల అతిక్రమణ జరుగుతోందని, కానీ దీనికి పరిమితి అంటూ ఉండాలని ఆమె పేర్కొన్నారు.

విజయవాడలో పుట్టి, చెన్నైలో పెరిగిన ఈమె ఆగ్రాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తాను ఎన్నికైతే ఇమ్మి గ్రంట్ల హక్కులకోసం పోరాడుతా నని మంగ తెలిపారు. అమెరికాలోనూ నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందని, ఇక్కడి వర్కర్స్ కి జాబ్స్ లభించవలసి ఉందని ఆమె అన్నారు. జమ్మూ కాశ్మీర్ కు 370 అధికరణం రద్దుపై మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, కేంద్రం తెఛ్చిన సీఏఏను మంగ సమర్థించారు.   ఇండియాకు వచ్చినప్పుడు తాను దేవాలయాలను సందర్శిస్తానని ఆమె చెప్పారు.

Follow Us