- Telugu News Latest Telugu News Telangana: Snake hiding inside parked scooty at old bus stand in Sirisilla district
Snake in Scooty: నిలిపి ఉన్న స్కూటీలో నుంచి వింత శబ్ధాలు.. ఏంటా అని చూడగా..
సిరిసిల్ల, సెప్టెంబర్ 18: స్కూటీ లో దూరిన పాము హల్చల్ చేసింది. రెండు గంటల పాటు చుక్కలు చూపెట్టింది. స్కూటీలోకి వెళ్లి బయటకు రాకుండా అందులోనే చిక్కుంది. తీయడానికి ప్రయత్నం చేసిన బెడిసికొట్టింది. చివరకు మెకానిక్ స్కూటీ విడి భాగాలు తీయడంతో పాము బయటపడింది. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ వద్ద నిలిపి ఉన్న స్కూటీలోకి పాము దూరింది. పాతబస్టాండ్ సమీపంలో షబ్బీర్ అనే వ్యక్తికి చెందిన స్కూటీని తన షాప్ ముందు పార్క్ చేసి పెట్టాడు. స్కూటీ లో పాము..
G Sampath Kumar | Edited By: Srilakshmi C
Updated on: Sep 18, 2023 | 9:24 AM

సిరిసిల్ల, సెప్టెంబర్ 18: స్కూటీ లో దూరిన పాము హల్చల్ చేసింది. రెండు గంటల పాటు చుక్కలు చూపెట్టింది. స్కూటీలోకి వెళ్లి బయటకు రాకుండా అందులోనే చిక్కుంది. తీయడానికి ప్రయత్నం చేసిన బెడిసికొట్టింది. చివరకు మెకానిక్ స్కూటీ విడి భాగాలు తీయడంతో పాము బయటపడింది.

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ వద్ద నిలిపి ఉన్న స్కూటీలోకి పాము దూరింది. పాతబస్టాండ్ సమీపంలో షబ్బీర్ అనే వ్యక్తికి చెందిన స్కూటీని తన షాప్ ముందు పార్క్ చేసి పెట్టాడు. స్కూటీ లో పాము దూరుతుండగా అది గమనించిన స్కూటీ యజమాని అప్రమత్తమయ్యారు. అప్పటికే తీయడానికి ప్రయత్నం చేశాడు. కానీ.. స్కూటీ లోపటి వరకు వెళ్ళింది.

దీంతో పక్కన ఉన్న మెకానిక్ తెలిపి, స్నేక్ క్యాచర్ కి సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్ స్కూటీ వద్దకు చేరుకొని మెకానిక్, క్యాచర్ గంటన్నర పాటు శ్రమించి బండి యొక్క విడి భాగాలు ఒక్కొక్కటి తొలగించిన పాము ఆచూకీ కనిపెట్టలేకపోయారు. చివరికి స్కూటీ నీ స్టార్ట్ చేసి ఎక్స్ లెటర్ సహాయంతో పెద్ద శబ్దం వచ్చేలా స్లార్ట్ చేశాడు.

ఆ సౌండ్ తో ఒక్కసారిగా ఇంజిన్‌లో దాక్కున చిన్న పాము బయటకి వచ్చింది. క్యాచర్ ఆ పామును గమనించి అక్కడ ఉన్న ఒక ప్లాస్టిక్ కవర్ చేతికి చుట్టుకొని పాము పిల్లను పట్టుకున్నాడు. పట్టుకున్న పామును బాటిల్ లో బంధించి జన సంచారం లేని ప్రాంతంలో వదిలేశాడు.

స్కూటీ పార్క్ చేసిన ప్రదేశం ఎప్పుడు జన సంచారంతో నిండి ఉంటుంది. పామును పట్టుకునే ప్రయత్నంలో స్కూటీ వద్ద జనం గుమిగూడి ఆసక్తిగా తిలకించారు. అదే సమయం ట్రాఫిక్ జామ్ అయ్యింది. పామును పట్టుకోవడం తో స్కూటీ యజమాని ఊపిరి పీల్చుకున్నారు.





























