AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీ, కాంగ్రెస్ నేతలకు ఎర్రబెల్లి బస్తీ మే సవాల్… ఏం నిధులు తెచ్చారో చూపాలంటూ డిమాండ్..

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలతో బస్తీ మే సవాల్ అన్నారు. రెండు  పార్టీల నేతలు తప్పుడు ప్రచారంతో రాజకీయాలు చేస్తున్నారని ఎర్రబెల్లి దయాకర్ విరుచుకుపడ్డారు.

బీజేపీ, కాంగ్రెస్ నేతలకు ఎర్రబెల్లి బస్తీ మే సవాల్… ఏం నిధులు తెచ్చారో చూపాలంటూ డిమాండ్..
Rajesh Sharma
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 16, 2020 | 8:06 PM

Share

Yerraballi Dayakar Rao: తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలతో బస్తీ మే సవాల్ అన్నారు. రెండు  పార్టీల నేతలు తప్పుడు ప్రచారంతో రాజకీయాలు చేస్తున్నారని ఎర్రబెల్లి దయాకర్ విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏం నిధులు తెచ్చారో సాక్ష్యాలతో చూపాలంటూ బీజేపీ నేతలను డిమాండ్ చేశారు. అదే సమయంలో రైతు బంధు వంటి పథకం ఏ రాష్ట్రంలో వుందో చెప్పాలంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలకు బహిరంగ సవాల్ విసిరారు.

మరో మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సోమవారం నాడు హన్మకొండలో మీడియాతో మాట్లాడారు. ‘‘ బీజేపీ నేతలు తప్పుడు ప్రచారాలతో తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు.. బీజేపీ నేతలు తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చారో సాక్ష్యాలతో చూపండి.. దుబ్బాకలో తప్పుడు ప్రచారాలు చేసి, ఓ కార్యకర్తను బలిచేసి ప్రజలను మోసం చేసి గెలిచారు.. బీజేపీకి చెందిన నలుగురు ఎంపీలు ఏం చేశారో శ్వేత పత్రం విడుదల చేయండి.. ’’ అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఎర్రబెల్లి.

‘‘ వర్షాలతో రాష్ట్రం అల్లకల్లోలం అయినా పట్టించు కోలేదు.. పేదల సంక్షేమంలో మీ పాత్ర ఏంటి? మిషన్ భగీరథకు కేంద్రం 10 అవార్డులు ఇచ్చి ప్రశంసించారు. కానీ ఒక్క రూపాయి కూడా కేటాయించ లేదు.. హైదరాబాద్ నగరం వరదలకు కొట్టుకుపోతే ఆదుకోవాలనే సోయి లేదు.. బీజేపీ నేతలు ప్రజలను పచ్చి మోసం చేస్తున్నారు.. బీజేపీ – కాంగ్రెస్ పార్టీలకు బహిరంగ సవాల్… దేశంలో ఏ రాష్ట్రంలోనైనా రైతు బంధు ఇస్తున్నారా.. ఇస్తే రుజువు చేయాలి..’’ అంటూ బస్తీ మే సవాల్ చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ