బ్రిటన్ ప్రజాప్రతినిధుల్లో కరోనా కలకలం.. మరోసారి నిర్బంధంలోకి వెళ్లిన ప్రధాని
కరోనా రాకాసి ఒక్కసారి వచ్చి పోయేటట్లు లేదు. రెండోసారి తన ప్రభావిస్తున్నట్లు కనిపిస్తుంది. దీంతో అయా దేశ ప్రభుత్వాలు మరోసారి ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి.

కరోనా రాకాసి ఒక్కసారి వచ్చి పోయేటట్లు లేదు. రెండోసారి తన ప్రభావిస్తున్నట్లు కనిపిస్తుంది. దీంతో అయా దేశ ప్రభుత్వాలు మరోసారి ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. కాగా, రెండోసారి కరోనా సోకుతుందనే భయంతో బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ మరోసారి స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కొవిడ్-19 బారిన పడిన వ్యక్తి ప్రధాని బోరిస్ జాన్సన్ కలిసిన నేపథ్యంలో తాను హోం ఐసోలేట్ అవుతున్నట్లు ప్రకటించారు.
కొవిడ్ -19 పాజిటివ్ అని పరీక్షల్లో తేలిన రోగి ప్రధాని బోరిస్ జాన్సన్ ను కలిసిన దృష్ట్యా ప్రధానికి స్వీయ నిర్బంధం అవసరమని యూకే నేషనల్ హెల్త్ సర్వీసు టెస్టు అండ్ ట్రేస్ ద్వారా తెలిపింది. ఇదివరకే కరోనా బారినపడటంతో జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు సూచించారు. ఈ నేపథ్యంలో కరోనా రోగి కలిసినందున ప్రధాని బోరిస్ జాన్సన్ స్వీయనిర్బంధంలో ఉంటారని డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి ప్రకటించారు. కరోనా రోగిని కలిసిన ప్రధాని బోరిస్ జాన్సన్ కు కరోనా లక్షణాలు లేవని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి చెప్పారు.
ప్రధాని జాన్సన్ డౌనింగ్ స్ట్రీట్ లో చట్టసభ సభ్యుల బృందాన్ని కలిశారు. ప్రధానిని కలిసిన వారిలో కన్జర్వేటివ్ పార్టీ సభ్యుడు లీ అండర్సన్ ఉన్నారు. లీ అండర్సన్ కు కరోనా సోకిందని తేలడంతో ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా అప్రమత్తమై, కరోనా సోకుతుందనే భయంతో ముందుజాగ్రత్తగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. బోరిస్ జాన్సన్ కు మార్చి నెలలో కరోనా వైరస్ సంక్రమించడంతో అతను ఆసుపత్రి ఐసీయూలో చికిత్స చేయించుకొని కోలుకున్నారు.
