గుడిలో పూజలు చేస్తూ ప్రాణాలొదిలిన మాజీ ఎమ్మెల్యే

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. ఉన్నపలంగా ఓ ఎమ్మెల్యే పూజలు చేస్తూ ప్రాణాలు విడిచాడు.

గుడిలో పూజలు చేస్తూ ప్రాణాలొదిలిన మాజీ ఎమ్మెల్యే

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. ఉన్నపలంగా ఓ ఎమ్మెల్యే పూజలు చేస్తూ ప్రాణాలు విడిచాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బైతూల్‌లో చోటుచేసుకుంది. బైతూల్ మాజీ ఎమెల్యే వినోదా డాగా ఆలయంలో పూజలు చేసేందుకు వెళ్లారు. పూజ చేస్తుండగానే అతను ప్రాణాలు కోల్పోయారు. వినోద్ డాగా చనిపోయిన ఉదంతం అక్కడున్న సీసీటీవీలో రికార్డయ్యింది.

ధన్‌తే‌రస్ సందర్భంగా బైతూల్ మాజీ ఎమ్మెల్యే, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మాజీ కోశాధికారి వినోదా డాగా… దాదావాడీలోని ఆలయంలో పూజ చేసేందుకు వెళ్లారు. ముందుగా ఆయన ఆలయంలోని పార్శ్వనాథునికి పూజలు చేశారు. అనంతరం దాదా గురుదేవ్ మందిరంలో ప్రదక్షిణలు చేసి, పూజ నిర్వహించారు. అక్కడే దాదా గురుదేవ్ పాదాలకు మోకరిల్లారు. తరువాత కొంచెం పక్కకు కదిలేలోగానే కొన్ని సెకెన్ల వ్యవధిలోనే ఎమ్మెల్యే వినోద్ డాగా ప్రాణాలొదిరారు. ఆ సమయంలో ఒక బాలుడు మందిరంలోకి వచ్చి, ఎమ్మెల్యే కిందపడి ఉండటాన్ని గమనించి పూజారికి చెప్పాడు. వెంటనే పూజారితోపాటు అక్కడున్నవారంతా మాజీ ఎమ్మెల్యేను లేపే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆయన స్పృహ కోల్పోయి అచేతనస్థితిలోకి చేరుకున్నారు.

దీంతో ఆలయ సిబ్బంది హుటాహుటీన సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతనిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీనికి ముందు మాజీ ఎమ్మెల్యే వినోద్ డాగా మధ్యప్రదేశ్ ఉపఎన్నికల ఫలితాల గురించి సమీక్షించేందుకు భోపాల్ నుంచి బైతూల్ వచ్చారు. దీపావళి సందర్భంగా దైవ దర్శనానికి వచ్చిన ఎమ్మెల్యే అనంతలోకాలకు ప్రయాణమయ్యారు.