‘కంగ్రాట్స్ ! బీజేపీ మిమ్మల్ని సీఎంని చేసింది’, నితీష్ కుమార్ పై చిరాగ్ పాశ్వాన్ సెటైర్
బీ'హార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఎల్ జె పీ నేత చిరాగ్ పాశ్వాన్ వెరైటీగా స్పందించారు. 'కంగ్రాచ్యులేషన్స్ నితిన్ జీ ! మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు..
బీ’హార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఎల్ జె పీ నేత చిరాగ్ పాశ్వాన్ వెరైటీగా స్పందించారు. ‘కంగ్రాచ్యులేషన్స్ నితిన్ జీ ! మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు.. ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగుతుందని ఆశిస్తాను.. ఎన్డీయే సీఎం గానే మీరు కంటిన్యూభావిస్తాను’అని ఆయన ట్వీట్ చేశారు. నాలుగు లక్షల మంది బీహారీలు తయారు చేసిన విజన్ డాక్యుమెంట్ (ఎల్ జె పీ మేనిఫెస్టో) ను మీకు పంపుతున్నానని, దీని నుంచి మీరు ఏ హామీలు నెరవేర్చాలనుకున్నా వాటిని పూర్తి చేయాలని చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు. పనిలో పనిగా మిమ్మల్ని సీఎం ని చేసినందుకు బీజేపీకి కూడా శుభాకాంక్షలు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఈ ఎన్నికల్లో మీ నేతృత్వంలోని జేడీ-యూ మూడో స్థానం లోకి దిగజారినప్పటికీ మీరు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా టాప్ పోస్ట్ (సీఎం పదవి) ని నిలుపుకున్నారని చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు. కాగా-2015 లో జరిగిన ఎన్నికల్లో జేడీయూ 71 సీట్లు, బీజేపీ 53 స్థానాలు సాధించగా ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఈ ట్రెండ్ రివర్స్ అయింది.