తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికపై పార్టీల కసరత్తు.. టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు

త్వరలో జరగనున్న తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు రాజకీయపార్టీలు దూకుడు పెంచాయి. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది.

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికపై పార్టీల కసరత్తు.. టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 16, 2020 | 6:16 PM

త్వరలో జరగనున్న తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు రాజకీయపార్టీలు దూకుడు పెంచాయి. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మిని తమ పార్టీ అభ్యర్థిగా నిర్ణయించినట్లు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్టం చేశారు. త్వరలో జరిగే తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించారు.

ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభకు పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన పనబాక లక్ష్మినే మళ్లీ అభ్యర్థిగా నిర్ణయించినట్లు చంద్రబాబు నేతలతో చెప్పారు. అభ్యర్థి విజయానికి పార్టీశ్రేణులంతా కష్టించి పనిచేయాలని చంద్రబాబు నేతలకు సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు అనుసరించాల్సిన వ్యుహన్ని ఈ సందర్భంగా ఆయన దిశానిర్దేశం చేశారు. వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో ఇటీవల మృతిచెందడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. త్వరలో తిరుపతి ఉపఎన్నిక జరుగనున్న నేపథ్యంలో పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించి బరిలోకి దింపుతున్నారు.