న్యాయమూర్తులపై అభ్యంతరకర కామెంట్ల కేసు.. 17 మందిపై సీబీఐ ఛార్జీషీట్.. లిస్టులో ముగ్గురు విదేశీయులు
సోషల్ మీడియా వుంది కదాని.. ఎటు పడితే అటు రాతలు రాస్తే.. కూతలు కూస్తే చెల్లుతుందనుకునే వారికి షాకిచ్చే వార్త ఇది. సోషల్ మీడియాలో రెచ్చిపోయే వారికి బుద్ది చెబుతామంటోంది సీబీఐ.
CBI case against social media violaters: ఏపీ హైకోర్టు న్యాయమూర్తులనుద్దేశించి సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అభ్యంతరకరమైన కామెంట్లు చేసిన వారిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ విషయంలో గతంలో సీఐడీ నమోదు చేసిన కేసులను పరిశీలించిన సీబీఐ.. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగింది. గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు 17మందిపై సీఐడీ కేసులు నమోదు చేయగా వారిపైనే ఇపుడు సీబీఐ కూడా కేసు నమోదు చేసింది. అయితే, గతంలో సీఐడీ దర్యాప్తుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. ఆ తర్వాతనే ఈ విషయంలో దర్యాప్తు చేయాలని సీబీఐని ఏపీ హైకోర్టు ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు.. 12 కేసులను విశాఖలో రిజిస్టర్ చేశారు. ప్రస్తుతం సీబీఐ ఇన్వెస్టిగేటింగ్ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీబీఐ బృందం పదిహేడు మందిపై కేసు నమోదు చేయగా వారిలో ముగ్గురు విదేశీయులున్నారు. హైకోర్ట్ రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ ఫిర్యాదు మేరకు ఈ పదిహేడు మందిపై 153ఎ, 504, 505(2), 506 ఐపీసీతో పాటు 67 ఐటీ యాక్ట్ కింద సీబీఐ కేసు నమోదు చేసింది. ఏ1గా కొండారెడ్డి, ఏ2గా మణిఅన్నపు రెడ్డి, ఏ3గా సుధీర్ పాముల, ఏ4గా అద్రాస్ రెడ్డి, ఏ5గా అభిషేక్ రెడ్డి, ఏ6గా శివారెడ్డి, ఏ7గా శ్రీధర్ రెడ్డి, ఏ8గా వెంకట సత్యనారాయణ, ఏ9గా జీ.శ్రీధర్ రెడ్డి, ఏ10గా లింగా రెడ్డి, ఏ11గా చందు రెడ్డి, ఏ12గా శ్రీనాథ్ సుస్వరం, ఏ13గా కిషోర్ రెడ్డి, ఏ14గా చిరంజీవి, ఏ15గా లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఏ16గా కె.గౌతమి, ఏ17గా అనౌన్ (గుర్తు తెలియని) వ్యక్తులను పేర్కొన్నారు. ఈ 17 మందిపై సోషల్ మీడియా, మీడియాలోను న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను అభియోగాలను నమోదు చేశారు.
ALSO READ: కార్పొరేటర్లపై క్రిమినల్ కేసులు.. క్రైమ్ హిస్టరీ సంపాదించిన టీవీ9
ALSO READ: బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ALSO READ: అభివృద్ధి పనులకు ఎన్నికల కమిషన్ అనుమతి