ఏపీపై హరీష్ రావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ప్రస్తుతం ఏపీలో జరుగుతోన్న పరిస్థితులపై తెలంగాణ మంత్రి హరీష్ రావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మూడు రాజధానుల అంశంతో.. ఏపీలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. ‘ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితులతో.. తెలంగాణలో స్థిరాస్తి వ్యాపారం పుంజుకునేందుకు దోహదపడనున్నాయా?’ అని మీడియా అడిగిన ప్రశ్నకు అవునంటూ సమాధానమిచ్చారు మంత్రి హరీష్ రావు. ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలతో.. రాజధాని ఏది అన్న విషయంపై అందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. గత 12 రోజుల నుంచి అమరావతిలోని రైతులు […]

ప్రస్తుతం ఏపీలో జరుగుతోన్న పరిస్థితులపై తెలంగాణ మంత్రి హరీష్ రావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మూడు రాజధానుల అంశంతో.. ఏపీలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. ‘ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితులతో.. తెలంగాణలో స్థిరాస్తి వ్యాపారం పుంజుకునేందుకు దోహదపడనున్నాయా?’ అని మీడియా అడిగిన ప్రశ్నకు అవునంటూ సమాధానమిచ్చారు మంత్రి హరీష్ రావు.
ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలతో.. రాజధాని ఏది అన్న విషయంపై అందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. గత 12 రోజుల నుంచి అమరావతిలోని రైతులు నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా జరిగిన కేబినేటి భేటీలో కూడా ఏపీ రాజధానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు వైసీపీ ప్రభుత్వం. దీంతో.. నిరసనలు ఇంకొంత ఊపు అందుకున్నాయి. అయితే ఇప్పుడు ఏపీలో నెలకొన్న పరిస్థితులపై హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆయన మాట్లాడుతూ.. ఏపీలో మూడు రాజధానుల అంశం ప్రజలను గందరగోళ పరిస్థితుల్లో పడేసిందన్నారు. హైదరాబాద్‌తో పాటుగా.. అమరావతిలోనూ భూమి ధరలు కోట్లలల్లో పలికాయన్నారు. కానీ మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనతో అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. ఇప్పుడు వ్యాపారులు భూములు కొనాలంటే క్యాపిటల్ ఎక్కడ ఏర్పాటు అవుతుందో అర్థంకాక కిందా మీదా పడుతున్నారన్నారు. దీంతో.. ఏం పాలుపోని పలువురు మళ్లీ హైదరాబాద్‌లో స్థిరాస్తులు కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారని పేర్కొన్నారు. అయినా.. దేశంలోని ఇతర పట్టణాలతో పోల్చితే హైదరాబాద్ పదిరెట్లు అనుకూలమని వ్యాఖ్యానించారు హరీష్ రావు.