మ్యాచ్‌ను ఎగ్గొట్టారు.. కస్సుమన్న బోర్డు.. ఇక తప్పని వేటు..?
టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్, యువ ఆల్‌రౌండర్ శివమ్ దూబే చిక్కుల్లో పడ్డారు. స్వంత నిర్ణయాలు తీసుకుని వేటు పడే స్థాయికి తెచ్చుకున్నారని తెలుస్తోంది. వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో టీమిండియా గెలవడానికి కీలకపాత్ర పోషించిన ఈ ఇద్దరూ రైల్వేస్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో ముంబై జట్టు ఓడిపోవడానికి కారకులైయ్యారట. డిసెంబర్ 26న ముంబై, రైల్వేస్ మధ్య మ్యాచ్ జరిగింది. అందులో ముంబై 10 వికెట్లు తేడాతో ఘోర పరాజయం చవి చూసింది. ఇక ఈ […]

టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్, యువ ఆల్‌రౌండర్ శివమ్ దూబే చిక్కుల్లో పడ్డారు. స్వంత నిర్ణయాలు తీసుకుని వేటు పడే స్థాయికి తెచ్చుకున్నారని తెలుస్తోంది. వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో టీమిండియా గెలవడానికి కీలకపాత్ర పోషించిన ఈ ఇద్దరూ రైల్వేస్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో ముంబై జట్టు ఓడిపోవడానికి కారకులైయ్యారట.
డిసెంబర్ 26న ముంబై, రైల్వేస్ మధ్య మ్యాచ్ జరిగింది. అందులో ముంబై 10 వికెట్లు తేడాతో ఘోర పరాజయం చవి చూసింది. ఇక ఈ పోరులో శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబేలు జట్టుకు అందుబాటులో లేరు. అంతేకాక ఎవరి అనుమతి లేకుండానే వీరు విశ్రాంతి తీసుకున్నారని తెలుస్తోంది. అందుకే ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోందని సమాచారం.
విండీస్‌తో జరిగిన ఫైనల్ వన్డేలో శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, శార్దూల్ ఠాకూర్‌లు బరిలోకి దిగారు. ఇక ఆ గేమ్ అయిపోయాక ఠాకూర్ రైల్వేస్ తరపున ఆడాడు గానీ.. మిగతా ఇద్దరూ విశ్రాంతి తీసుకున్నారు. ఎవరి సూచనల మేరకు విశ్రాంతి తీసుకున్నారని జట్టు యాజమాన్యం ప్రశ్నించగా.. సెలెక్టర్లు అని అయ్యర్, దూబేలు జవాబిచ్చినట్లు తెలుస్తోంది.
అయితే బీసీసీఐ, సెలెక్టర్లు, ఫిజియోల నుంచి తమకు ఎటువంటి సమాచారం అందలేదని.. మీరు సొంత నిర్ణయాలు తీసుకుని బోర్డు పరువు తీశారని ఎంసీఏ అధికారులు వీరిపై గుస్సా అయ్యారట. ఈ విషయంపై త్వరలో జరిగే మండలి సమావేశంలో చర్చించి కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చిరించినట్లు సమాచారం.