గెలిచావ్..నువ్వంటే గౌరవమే..కానీ ఇదేం పద్దతి కోమ్..

సస్పెన్స్ ఏమి లేదు. సంచలనాలు అంతకన్నా లేవు. దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ టోక్యో ఒలంపిక్స్‌కు అర్హత సాధించింది. 51 కిలోల కేటగిరీలో  తెలంగాణ బాక్సింగ్ యువకెరటం నిఖత్ జరీన్‌ను చిత్తుచేసిన కోమ్..9-1 తేడాతో గెలిచి తన సత్తా ఏంటో నిరూపించుకుంది. అయితే ఇక్కడ కోమ్ ప్రవర్తించిన తీరుపై పలువురు క్రీడా నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బౌట్‌కి ముందు బాక్సర్స్ ఫార్మల్‌గా ఇచ్చుకునే హగ్‌కు కోమ్ స్పందించలేదు. జరీన్‌.. మేరీకి షేక్‌హ్యాండ్‌ ఇవ్వబోగా అందుకు […]

గెలిచావ్..నువ్వంటే గౌరవమే..కానీ ఇదేం పద్దతి కోమ్..
Follow us

|

Updated on: Dec 29, 2019 | 8:40 AM

సస్పెన్స్ ఏమి లేదు. సంచలనాలు అంతకన్నా లేవు. దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ టోక్యో ఒలంపిక్స్‌కు అర్హత సాధించింది. 51 కిలోల కేటగిరీలో  తెలంగాణ బాక్సింగ్ యువకెరటం నిఖత్ జరీన్‌ను చిత్తుచేసిన కోమ్..9-1 తేడాతో గెలిచి తన సత్తా ఏంటో నిరూపించుకుంది. అయితే ఇక్కడ కోమ్ ప్రవర్తించిన తీరుపై పలువురు క్రీడా నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

బౌట్‌కి ముందు బాక్సర్స్ ఫార్మల్‌గా ఇచ్చుకునే హగ్‌కు కోమ్ స్పందించలేదు. జరీన్‌.. మేరీకి షేక్‌హ్యాండ్‌ ఇవ్వబోగా అందుకు కూడా ఆమె తిరస్కరించింది. అంతేకాదు బౌట్ జరుగుతున్నప్పుడు కోమ్ నిరంతరం తనను దూషించిందని, ఒకసారి తీవ్ర పదజాలం ఉపయోగించిందని..జరీన్ చెప్పుకొచ్చింది. దీంతో ఈ విషయం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది.

ఎప్పట్నుంచో నడుస్తోన్న వివాదం :

ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో గోల్డ్ లేదా సిల్వర్ మెడల్ గెలిచినవాళ్లకు ట్రయల్స్‌లో మినహాయింపునిచ్చి డైరెక్ట్‌గా క్వాలిఫైయింగ్‌కు వెళ్లే వెసులుబాట కల్పించింది భారత బాక్సింగ్ సమాఖ్య. అయితే ఈ ఏడాది కోమ్ కాంస్యానికి పరిమితమవ్వడంతో ఆమె కూడా ట్రయిల్స్‌‌లో నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఆమె ఇంతకుముందు చేసిన ప్రదర్శన దృష్ట్యా ట్రయల్స్‌ అవసరం లేకుండా, క్వాలిఫైయింగ్ టోర్నీకి పంపాలని బీఎఫ్ఐ అధ్యక్షుడు అజయ్ సింగ్ భావించారు. దీంతో వివాదం రాజుకుంది.

వాస్తవానికి గతంలో మేరీ 48 కేజీల విభాగంలో పోటీ పడింది. ఈ సారి 51 కేజీల విభాగానికి ఛేంజ్ అయ్యింది. దీంతో అప్పటివరకు 51 విభాగంలో ఛాన్స్ కోసం చెమటోడుస్తోన్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌ ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. అయితే ట్రయిల్స్ జరపకుండా నిర్ణయాలు తీసుకోవద్దంటూ  బాక్సర్ నిఖత్ జరీన్ బీఎఫ్ఐకి విన్నపం చేసింది. ఈ మేరకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజుకు సైతం లేఖ రాసింది.  దీంతో బీఎఫ్ఐ నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సి వచ్చింది.  శుక్రవారం జరిగిన ట్రయల్ పోటీల్లో నిఖత్ జరీన్.. జాతీయ చాంపియన్ జ్యోతి గులియాపై విజయం సాధించింది. మరోవైపు దిగ్గజ బాక్సర్ మేరీకోమ్.. బాక్సర్ రీతు గ్రెవాల్‌పై విజయం సాధించింది. దీంతో  నిఖత్ జరీన్, మేరీకోమ్ ఫైనల్ ట్రయల్స్‌లో తలపడగా మేరీకోమ్ ఏకపక్ష విజయం సాధించింది.

బౌట్ అనంతరం మేరీ కోమ్ మీడియాతో మాట్లాడింది. జరీన్‌తో తానేందుకు చేతులు కలపాలని ప్రశ్నించింది. ఆమె ముందుగా సీనియర్స్‌ను గౌరవించాలని, బాక్సర్స్ ఎవరైనా తమ బలాన్ని రింగ్‌లో చూపించాలి బయట కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇక కోమ్ ప్రవర్తనపై జరీన్ అసహనం వ్యక్తం చేసింది. సీనియర్ల నుంచి జూనియర్లకు గౌరవం దక్కుతుందని ఆశించానని, హత్తకోవడానికి కూడా కోమ్ ఒప్పుకోకపోవడం తనను కలిచివేసిందని పేర్కుంది.