AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana High Court: ఎట్టకేలకు ఫలించిన సర్కార్ ప్రయత్నాలు.. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు..!

ఎట్టకేలకు తెలంగాణలో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచుతూ కేంద్రన్యాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. న్యాయమూర్తుల సంఖ్య 24 నుండి 42కు పెంచింది.

Telangana High Court: ఎట్టకేలకు ఫలించిన సర్కార్ ప్రయత్నాలు.. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు..!
Telangana High Court
Balaraju Goud
|

Updated on: Jun 10, 2021 | 10:28 AM

Share

Telangana High Court Bench Judges: ఎట్టకేలకు తెలంగాణలో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచుతూ కేంద్రన్యాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదనంగా న్యాయమూర్తులను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు లేఖలు రాసింది. దీంతో చాలా కాలం తర్వాత చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణ చొరవతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తుల సంఖ్య 24 నుండి 42కు పెంచుతూ కేంద్రన్యాయ శాఖతో పాటు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక నిర్ణయం తీసుకున్నారు.

అయితే, ఇందుకోసం కేంద్ర న్యాయశాఖకు అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, హైకోర్టు, సుప్రీం కోర్టుల నుండి విజ్ఞప్తుల చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్వీ రమణ దేశంలో పెండింగ్‌ ఉన్న వివిధ హైకోర్టుల ప్రతిపాదనలు పరీశీలించారు. వీటిని కేంద్ర న్యాయశాఖతోపాటు ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలోనే మరోసారి కేంద్రన్యాయశాఖ మంత్రికి లేఖ రాశారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వినతులతోపాటు ఇక్కడ ఉన్న పరిస్థితులను ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఇందుకు సంబంధించి రాష్ట్ర హైకోర్టులో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని, అక్కడ మొత్తం 42 మందికి అవరమైన మౌళిక వసతులు సైతం ఉండడతోపాటు అదనంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఏమి లేదని వివరించినట్లు సమాచారం. సీజేఐ లేఖతో స్పందించిన కేంద్రన్యాయ శాఖ, న్యాయమూర్తుల పెంపుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న సంఖ్య 24 నుండి 42కు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. దీంతో సోమవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆమోదం తెలిపారు. ఇక పెంపుదల సంఖ్య సోమవారం నుండే అధికారికంగా అమల్లోకి రానుందని అధికారిక వర్గాలు వెళ్లడించాయి. అయితే, దీనిపై కేంద్ర న్యాయశాఖ అధికారికంగా ఉత్తర్వులు వెల్లడించాల్సివుంది.

కాగా, ప్రస్తుతం తెలంగాణలో సుమారు రెండున్నర లక్షల కేసులు పెండింగ్‌లో ఉండగా వాటిలో 2.10 వేలు సివిల్ , మరో 40వేల క్రిమినల్ కేసులు ఉన్నట్టు సమాచారం. ఈ కేసులను విచారించేందుకు ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తులపై భారం ఎక్కువవుతుండడంతో పాటు పెండింగ్ కేసులు పేరుకుపోయే అవకాశాలు ఉండడం, ఏపీ ప్రత్యేకంగా హైకోర్టు ఏర్పాటు చేసుకున్న తర్వాత అందుకు తగ్గట్టుగా కేసులను పరిష్కరించే మౌళిక వసతులు కూడా ఉండడంతో కొత్త పోస్టులు మంజూరు అయ్యాయి..

వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రధానమూర్తుల సంఖ్యతో పోలిస్తే.. తెలంగాణ 13వ స్థానంలో ఉంది..ముఖ్యంగా తెలంగాణ కంటే అధిక జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో 37 పోస్టులు ఉండగా తాజాగా పెంచిన వాటితో తెలంగాణకు అదనంగా 5 పోస్టులు దక్కాయి. ఇక ఎక్కువ మొత్తంలో అలహాబాద్ హైకోర్టులో 160 న్యాయమూర్తుల పోస్టులుండగా, ముంబయి హైకోర్టుకు 94, పంజాబ్, హర్యానాలో 85, తమిళనాడులోని చెన్నై హైకోర్టుకు 75, కోల్‌కతాకు 72, కర్ణాటకలో 62, ఢిల్లీలో 60, మధ్యప్రదేశ్‌లో 53, బీహార్‌లో 53, గుజరాత్‌లో 52 రాజస్థాన్ హైకోర్టుకు 50 కేరళ హైకోర్టుకు 47 పోస్టులు ఉన్నాయి..

Read Also… చాణక్య నీతి: ఈ ప్రదేశాలలో ఇల్లు నిర్మించవద్దు.. లేదంటే సందప, గౌరవ భంగం కలిగే అవకాశం..