AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: డిగ్రీ చేసిన వారికి గోల్డెన్ ఛాన్స్.. జాబ్ కొట్టేందుకు ఫ్రీ ట్రైనింగ్.. ఇదిగో పూర్తి డీటెయిల్స్

మీది డిగ్రీ అయిపోయిందా, లేదా ఫైనల్ ఇయర్‌లో ఉన్నారా? ఉద్యోగం ఎలా సంపాధించాలో తెలియడం లేదా.. టెన్షన్ పడొద్దు. ఇలాంటి వారి కోసంమే తెలంగాణ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఉద్యోగాలు సాధించేందుకు, ఇంటర్యూలో రాణించేందుకు ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది ప్రభుత్వం. ఇంకెందుకు లేట్‌ దీని పూర్తి వివరాలేంటో తెలుసుకుందాం పదండి.

Telangana: డిగ్రీ చేసిన వారికి గోల్డెన్ ఛాన్స్.. జాబ్ కొట్టేందుకు ఫ్రీ ట్రైనింగ్.. ఇదిగో పూర్తి డీటెయిల్స్
Employability Skill Development
Prabhakar M
| Edited By: |

Updated on: Apr 04, 2026 | 4:03 PM

Share

రాష్ట్రంలో డిగ్రీ చేసి ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్న యువతకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో యువతకు మంచి అవకాశాన్ని అందిస్తోంది. నైపుణ్యాలను పెంపొందించి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచేందుకు ప్రత్యేకంగా ఉచిత ఎంప్లాయబిలిటీ స్కిల్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉద్యోగ అవకాశాలపై అవగాహనతో వివిధ స్కిల్స్‌పై ట్రైనింగ్ ఇచ్చి విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేయనున్నారు.

ఈ కార్యక్రమాన్ని నిర్మాణ ఆర్గనైజేషన్‌తో కలిసి నిర్వహించగా, రెండు రోజులపాటు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఏప్రిల్ 8, 9 తేదీలలో ఈ శిక్షణ జరుగుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరోలో ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహించనున్నారు. డిగ్రీ, డిప్లమా, పీజీ లేదా ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన వారు లేదా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ ట్రైనింగ్‌కు అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్‌లో ఉద్యోగ అవకాశాలపై అవగాహనతో పాటు కమ్యూనికేషన్, ఇంటర్వ్యూ స్కిల్స్ వంటి అంశాల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ అందించనున్నారు.

ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 8న ఉదయం 10 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఎదుట ఉన్న ఎంప్లాయిమెంట్ బ్యూరోలో నేరుగా హాజరుకావాలి. హాజరయ్యేటప్పుడు విద్యార్హత సర్టిఫికేట్లు, ఆధార్ జిరాక్స్ తీసుకురావాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 8801528936 నంబర్‌ను సంప్రదించవచ్చు. యువత ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ భవిష్యత్తుకు బలమైన అడుగు వేయాలని అధికారులు సూచిస్తున్నారు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us