Vaccination in Telangana: ప్రైవేట్ సంస్థల్లో వాక్సినేషన్‌కు తెలంగాణ స‌ర్కార్ అనుమతి.. వివ‌రాలు

ప్రైవేట్ సంస్థల్లో కరోనా వ్యాక్సినేషన్‌కు తెలంగాణ స‌ర్కార్ అనుమతి ఇచ్చింది. తమ సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు వెసులుబాటు కల్పించింది.

Vaccination in Telangana:   ప్రైవేట్ సంస్థల్లో వాక్సినేషన్‌కు తెలంగాణ స‌ర్కార్ అనుమతి.. వివ‌రాలు
Vaccine
Follow us
Ram Naramaneni

|

Updated on: May 25, 2021 | 4:43 PM

ప్రైవేట్ సంస్థల్లో కరోనా వ్యాక్సినేషన్‌కు తెలంగాణ స‌ర్కార్ అనుమతి ఇచ్చింది. తమ సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు వెసులుబాటు కల్పించింది. పని ప్రదేశాల్లో టీకాలు వేసేందుకు ఆయా సంస్థలకు సర్కారు అనుమ‌తి​ ఇచ్చింది. వ్యాక్సినేషన్‌ కోసం ప్రైవేట్ ఆస్పత్రులతో.. సంస్థలు అనుసంధానం కావాలని డైరెక్టర్​ ఆఫ్​ హెల్త్​ శ్రీనివాసరావు సూచించారు. 18 ఏళ్లు నిండిన వారి వివరాలు కొవిన్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని పేర్కొన్నారు. ఈ మేర‌కు 18 ఏళ్లు పైబడిన వ్యక్తులకు క‌రోనా వ్యాక్సిన్ వేసేందుకు అన్ని ప్రైవేటు ఆస్ప‌త్రుల‌కు అనుమ‌తిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం ఆదేశాలు జారీ చేసింది. క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అనుస‌రించి సంస్థలు, కంపెనీలు, గేటెడ్ కంపెనీల అభ్యర్థన మేరకు ప్రైవేటు ఆస్ప‌త్రులు టీకా డ్రైవ్‌లు నిర్వహించవ‌చ్చ‌న్నారు.  రాష్ట్రంలో సెకండ్ డోసు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మంగ‌ళ‌వారం ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే.

వ్యాక్సినేషన్‌ విషయంలోనూ ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలని, ఇందుకు ప్రత్యేక విధానం రూపొందించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. రాష్ట్రంలో జనవరి 16న కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు టీకాలు వేసిన ప్రభుత్వం.. తర్వాత 60ఏళ్లు నిండిన వారికి, ఆ తర్వాత 45 ఏళ్లు పైబడిన వారికి పంపిణీ మొదలుపెట్టింది.

మ‌రోవైపు తెలంగాణ‌లో క‌ఠినంగా లాక్ డౌన్ కొన‌సాగుతంది. ఎటువంటి అత్య‌వ‌సరాలు లేకండా రోడ్డుపైకి వ‌చ్చేవారిపై పోలీసులు కేసులు న‌మోదు చేసి.. వారి వాహ‌నాలు సీజ్ చేస్తున్నారు. ఈ నెలాఖ‌రు వ‌ర‌కు లాక్ డౌన్ అమ‌ల్లో ఉంటుంది. లాక్ డౌన్ కొన‌సాగింపు లేదా అన్ లాక్ ప్ర‌క్రియ‌పై సీఎం కేసీఆర్ ఈనెల 28న చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటారు.

Also Read: ఆనందయ్య నాటు మందు పంపిణీపై విచారణకు హైకోర్టు అనుమతి.. గురువారం డివిజన్ బెంచ్ విచారణ

ఉత్తరాంధ్ర జిల్లా కలెక్టర్లతో సీఎం సమీక్ష.. తుఫాన్ దృష్ట్యా అధికారులకు దిశానిర్దేశం