ఎండల ఎఫెక్ట్… స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు

ఎండలు దంచి కొడుతున్నాయి. రోజు రోజుకు వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండలు మండి పోతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగత్రలకు జనం అల్లాడుతున్నారు.ఈ సారి రుతుపవనాలరాక కూడా ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ఎండల వేడి నుంచి కాస్త ఉపశమనం కల్గించేందుకు వేసవి సెలవులను జూన్‌ 12 వరకు పొడిగిస్తున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. వాస్తవానికి, […]

ఎండల ఎఫెక్ట్... స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
Follow us

| Edited By:

Updated on: May 24, 2019 | 7:49 PM

ఎండలు దంచి కొడుతున్నాయి. రోజు రోజుకు వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండలు మండి పోతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగత్రలకు జనం అల్లాడుతున్నారు.ఈ సారి రుతుపవనాలరాక కూడా ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ఎండల వేడి నుంచి కాస్త ఉపశమనం కల్గించేందుకు వేసవి సెలవులను జూన్‌ 12 వరకు పొడిగిస్తున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. వాస్తవానికి, జూన్‌ 1 నుంచి పునఃప్రారంభం కావాల్సిన పాఠశాలలు విద్యాశాఖ జారీచేసిన ఈ తాజా ఉత్తర్వులతో జూన్‌ 12 నుంచి ప్రారంభం కానున్నాయి.