AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సిద్ధి వినాయకుడికి మొక్కులు చెల్లించుకున్న దేవేంద్ర ఫడ్నవిస్

మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 48 లోక్‌సభ స్థానాల్లో ఎన్డీయే కూటమి ఏకంగా 41 స్థానాలను దక్కించుకుంది. బీజేపీ 23 స్థానాలు, శివసేన 18 స్థానాల్లో గెలుచుకున్నాయి. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి కేవలం 5 స్థానాలకు పరిమితంకాగా…ఇతరులు మరో రెండు స్థానాల్లో విజయం సాధించారు. మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ శక్రవారం ముంబైలోని సిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక […]

సిద్ధి వినాయకుడికి మొక్కులు చెల్లించుకున్న దేవేంద్ర ఫడ్నవిస్
Ram Naramaneni
|

Updated on: May 24, 2019 | 7:35 PM

Share

మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 48 లోక్‌సభ స్థానాల్లో ఎన్డీయే కూటమి ఏకంగా 41 స్థానాలను దక్కించుకుంది. బీజేపీ 23 స్థానాలు, శివసేన 18 స్థానాల్లో గెలుచుకున్నాయి. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి కేవలం 5 స్థానాలకు పరిమితంకాగా…ఇతరులు మరో రెండు స్థానాల్లో విజయం సాధించారు. మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ శక్రవారం ముంబైలోని సిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సిద్ధి వినాయక ఆలయాన్ని దేవేంద్ర ఫడ్నవిస్ దర్శించుకున్న సమయంలో బీజేపీకి చెందిన పలువురు నేతలు కూడా ఆయన వెంట ఉన్నారు. సిద్ధి వినాయక ఆలయ అధికారులు ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌కు దర్శన ఏర్పాట్లు చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Follow Us