AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ సర్కార్ మరో గుడ్‌న్యూస్…

తెలంగాణ ప్రభుత్వం పది పరీక్షలపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులను రెగ్యులర్‌గా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ సర్కార్ మరో గుడ్‌న్యూస్...
Ravi Kiran
|

Updated on: Jun 06, 2020 | 4:06 PM

Share

తెలంగాణ ప్రభుత్వం పది పరీక్షలపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులను రెగ్యులర్‌గా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టుకు ఏజీ ప్రసాద్ నివేదించారు. కరోనా వైరస్ కారణంగా ఈ నెల 8వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు హాజరు కాలేకపోయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్ష రాయొచ్చునంది. అప్పుడు ఆ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారిని రెగ్యులర్ విద్యార్థులుగా గుర్తిస్తామని పేర్కొంటూ తెలంగాణ  ప్రభుత్వం తాజాగా జీవో విడుదల చేసింది.

ఇకపోతే పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులను రెగ్యులర్‌గానే పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని అడ్వకేట్ జనరల్ ప్రసాద్ హైకోర్టుకు నివేదించారు. ఇక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యాశాఖ ప్రత్యేక సీఎస్ చిత్ర రామచంద్రన్, ఎస్ఎస్‌సీ బోర్డు డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి విచారణకు హాజరయ్యారు.

రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని పిటిషనర్ వాదించారు. పంజాబ్‌ తరహాలో ఇక్కడ కూడా పరీక్షలు లేకుండానే విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వాలని తెలిపారు. దీనితో పరీక్షలు లేకుండా గ్రేడింగ్ ఇస్తే ఇబ్బందేంటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అంతేకాక ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి మినహా మిగతా జిల్లాల్లో మాత్రమే పరీక్షలు నిర్వహించాలని సూచించింది.

దానికి సమాధానంగా ”రాష్ట్రంలో వేర్వేరుగా పరీక్షలు నిర్వహించడం కష్టమని.. ప్రశ్నపత్రాన్ని మళ్లీ మళ్లీ తయారుచేయడం ఇబ్బందవుతుందని” అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. దీనితో విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమా.. సాంకేతిక అంశాలు ముఖ్యమా అని హైకోర్టు ప్రశ్నించగా.. ప్రభుత్వాన్ని సంప్రదించి నిర్ణయం చెబుతామని అడ్వకేట్ జనరల్ విన్నవించారు. కాగా, తదుపరి విచారణను హైకోర్టు సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది.

Also Read:

గుడ్ న్యూస్.. ఏపీలో విద్యార్ధులకు ఫ్రీగా స్మార్ట్ ఫోన్స్..

ఏపీలో మరిన్ని సడలింపులు.. ఆలయాలు, హోటల్స్, మాల్స్‌కు నయా రూల్స్…

కిమ్ ఆస్తుల ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, బెంగళూరుకు బస్సులు.. కానీ!

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

కులాంతర వివాహాలు చేసుకునేవారికి గుడ్ న్యూస్.. దరఖాస్తు చేసుకోండిలా..