ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అంతర్రాష్ట్ర సర్వీసులు షురూ.. కానీ!

అన్-లాక్ 1 నేపధ్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను తిప్పేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ కార్యాచరణ సిద్దం చేస్తోంది. బస్సులు తిప్పడానికి అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలను కోరింది.

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అంతర్రాష్ట్ర సర్వీసులు షురూ.. కానీ!
Follow us

|

Updated on: Jun 05, 2020 | 2:04 PM

అన్-లాక్ 1 నేపధ్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను తిప్పేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ కార్యాచరణ సిద్దం చేస్తోంది. బస్సులు తిప్పడానికి అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తమిళనాడు మినహా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలకు లేఖ రాశారు. ప్రస్తుతం అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు లేనందున వివిధ రాష్ట్రాల నుంచి చాలామంది ప్రజలు ప్రైవేట్ వాహనాల ద్వారా ఏపీకి వస్తున్నారు. ఇక వారి వివరాలను బోర్డర్‌లో సేకరించడం కష్టతరంగా మారిందంటూ జిల్లాల కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి తెలపడమే కాకుండా.. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను త్వరితగతిన ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.

గతంలో తెలంగాణ నుంచి 13 వేల మంది ఏపీకి వచ్చేందుకు స్పందన పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోగా.. వారిని తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం బస్సులను కూడా సిద్దం చేసింది. కానీ అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పాసులు లేకుండానే అంతర్రాష్ట్ర ప్రయాణాలకు అనుమతిచ్చింది. దీనితో ఆ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం జగన్ సర్కార్ ఎదురు చూస్తోంది. కాగా, తమిళనాడులో కరోనా విలయం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పట్లో ఇతర రాష్ట్రాల బస్సులను అనుమతించేది లేదని పళనిస్వామి సర్కార్ తేల్చి చెప్పేసింది. కాబట్టి మిగిలిన రాష్ట్రాల నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే  రాష్ట్ర ప్రభుత్వం అనుమతులతో  బస్సు సర్వీసులు ప్రారంభించేందుకు ఏపీఎస్ఆర్టీసీ సిద్దమవుతోంది.

ఇది చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై భూములకు ‘భూధార్’..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.