Lockdown: తెలంగాణలో లాక్‌డౌన్.? 15 నుంచి పెట్టే అవకాశం.!! నేడే సర్కార్ కీలక నిర్ణయం..

Corona Lockdown In Telangana: రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించే దిశగా..

Lockdown: తెలంగాణలో లాక్‌డౌన్.? 15 నుంచి పెట్టే అవకాశం.!! నేడే సర్కార్ కీలక నిర్ణయం..
Kcr
Follow us

|

Updated on: May 11, 2021 | 10:15 AM

Corona Lockdown In Telangana: రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించే దిశగా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో పది రోజులు లేదా రెండు వారాల పాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతోన్న పాజిటివ్ కేసులను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారమని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ జరగబోయే కేబినేట్ భేటిలో లాక్‌డౌన్‌ పెడితే తలెత్తే పరిణామాలు, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై ప్రభావం, తదితర అంశాలపై సమగ్రంగా చర్చించి అధికారికంగా ప్రకటించనున్నారు.

ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్ డౌన్ అమలవుతోంది. ఇటు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోనూ 18 గంటల కర్ఫ్యూ అమలవుతుంటే.. రాష్ట్రంలో మాత్రం నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. పగటిపూట అన్ని కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. ఈ సమయంలో ప్రజలు స్వీయ నియంత్రణ పాటించకపోవడం, మాస్క్‌లు సైతం ధరించకపోవడంతో పరిస్థితి చేయిదాటక ముందే జాగ్రత్త పడాలనే యోచనకు ప్రభుత్వం వచ్చినట్లు సమాచారం. అటు కరోనా బాధితులకు ఆసుపత్రుల్లో పడకలు లభించని పరిస్థితి ఏర్పడటంతో లాక్‌డౌన్ అనివార్యమనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

కాగా, తొలుత రాష్ట్రంలో పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ పెడితే ఆర్ధిక వ్యవస్థ దెబ్బ తింటుందని, పేదలు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ప్రభుత్వం భావించింది. అయితే కరోనా వేగంగా విస్తరించే అవకాశాలున్నాయని జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, వైద్య నిపుణులు చేస్తున్న హెచ్చరికల నేపధ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సర్కార్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Also Read:

హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితులు.. ఏం చేయాలి.? ఏం చేయకూడదు.?

ఐపీఎల్ వాయిదా.. పలు ఫ్రాంచైజీలకు లాభం.. ఆ ఐదుగురు ప్లేయర్ల పునరాగమనం.!

Viral Video: ద్యావుడా.. బైక్‌పై ఇలా కూడా వెళ్తారా.. నవ్వు తెప్పిస్తున్న వీడియో..!

భారీ నాగపామును పట్టి బరాబరా ఈడ్చుకెళ్లిన బామ్మ.. నెటిజన్లు ఫిదా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.!