New Year : 2021 సంవత్సరంలో ప్రముఖులు ఏం చేయబోతున్నారు ?.. వాళ్ళు ఏం రిజల్యూషన్ పెట్టుకున్నారో చూసేద్దాం..
మనలో చాలా మంది కొత్త సంవత్సరంలో ఆ పని చేస్తాం, ఈ పని చేస్తాం అంటూ ఎన్నో రకాల లక్ష్యాలు పెట్టుకుంటారు. న్యూఇయర్లో ప్రతి ఒక్కరు రిజల్యూషన్ పెట్టుకోవడం అనేది కామన్.

మనలో చాలా మంది కొత్త సంవత్సరంలో ఆ పని చేస్తాం, ఈ పని చేస్తాం అంటూ ఎన్నో రకాల లక్ష్యాలు పెట్టుకుంటారు. న్యూఇయర్లో ప్రతి ఒక్కరు రిజల్యూషన్ పెట్టుకోవడం అనేది కామన్. మనం మాత్రమే కాకుండా ఎప్పుడు బిజీగా ఉండే ప్రముఖులు ఈ కొత్త ఏడాదికి ఏమని రిజల్యూషన్ పెట్టుకున్నారో చూసెద్దామా..
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్.. ప్రధాని మోదీ ఇచ్చిన లోకల్-వోకల్ నినాదం ఆదర్శంగా తీసుకుంటాను. 2021లో పూర్తిగా స్వదేశీ వస్తువులను మాత్రమే వాడాలని నిర్ణయించుకున్నాను. రోజూ పొద్దున గంటసేపు యోగ, వ్యాయామం చేస్తాను. ఈ ఏడాదిలో ఆరోగ్య పరంగా మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాను.
స్వాతి లక్రా, ఏడీజీ, విమెన్ సేఫ్టీ వింగ్.. స ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఆరు రోజులు వ్యాయామం చేయాలనుకుంటున్నాను. గతేడాది కూడా ఇదే అనుకున్నాను. కానీ కుదరలేదు. ఏదేమైనా ఈసారి చేయాలనుకుంటున్నాను. శారీరకంగా దృఢంగా ఉంటే మానసికంగా కూడా బలంగా ఉంటామని నమ్ముతాను. అంతేకాకుండా ఆత్మవిశ్వాసంతోపాటు, రోగనిరోదక శక్తి కూడా పెరుగుతుంది.
మంత్రి టీ. హరీష్ రావు.. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నుంచి నేను నాలుగు నెలలు యోగా చేయడం లేదు. అంతకుముందు నాకు యోగా చేసే అలవాటు ఉంది. ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో యోగాపై దృష్టిసారిస్తా.. ప్రతిరోజు ప్రాణాయామం ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నా..
కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి.. నేను రోజూ వాకింగ్ చేయడం లేదు. ఇంతకు ముందు రెగ్యులర్ గా చేసేవాడిని. ఈ సంవత్సరం నా శరీర దృడత్వానికి ప్రాముఖ్యత ఇస్తాను. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం 5 కిలోమీటర్లు నడుస్తా అనుకుంటున్నాను.




