ఈ మ్యారేజ్ బ్యూరోలో కేవలం రైతులకు మాత్రమే సంబంధాలు చూడబడును

రైతులు దేశానికి వెన్నుముక అని చెబుతారు. సందర్బం వచ్చిన ప్రతిసారి ఉపన్యాసాలు దంచేస్తారు. కానీ ఆకలి తీర్చే రైతులకు ఆడిపిల్లను ఇచ్చి పెళ్లి చేయడానికి మాత్రం సాహసించడం లేదు.

ఈ మ్యారేజ్ బ్యూరోలో కేవలం రైతులకు మాత్రమే సంబంధాలు చూడబడును
Follow us

|

Updated on: Oct 26, 2020 | 7:00 PM

రైతులు దేశానికి వెన్నుముక అని చెబుతారు. సందర్బం వచ్చిన ప్రతిసారి ఉపన్యాసాలు దంచేస్తారు. కానీ ఆకలి తీర్చే రైతులకు ఆడిపిల్లను ఇచ్చి పెళ్లి చేయడానికి మాత్రం సాహసించడం లేదు. పది వేలు సంపాదించినా చాలు…పట్నంలో జాబు ఉంటే చాలు కాళ్లు కడిగి కన్యాదానం చేస్తున్నారు. దీంతో చాలా మంది రైతులు పెళ్లిళ్లు అవ్వడం లేదు. ఈ విషయం ఓ రైతును బాగా బాధపెట్టింది. అతడు బాధ పడి సైలెంట్‌గా ఉండలేదు.  ఓ వినూత్న ఐడియాతో ముందుకు వచ్చారు. కేవలం రైతుల కోసం మాత్రమే స్పెషల్  మ్యారేజ్‌ బ్యూరో ఏర్పాటు చేశారు. కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా రైతు అయి ఉంటే చాలు సంబంధాలు కుదుర్చుతున్నారు.  కేతిరెడ్డి అంజిరెడ్డి  అనే వ్యక్తి కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండల కేంద్రంలో ఈ మ్యారేజ్ బ్యూరో  నెలకొల్పారు. ఇది ఏర్పాటై ఇప్పటి వరకు 10 రోజులవుతండగా… విశేష స్పందన లభిస్తోంది. ఎంతో మంది అతడి ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు. చాలా మంది యువ రైతులు పెళ్లి సంబంధాల కోసం అక్కడకు వస్తున్నారు. గత 10 రోజుల్లో తనకు కనీసం 5 వేల ఫోన్లు వచ్చాయని అంజిరెడ్డి తెలిపారు.  సోషల్‌ మీడియాతో పాటు పలు న్యూస్ చానల్స్ కూడా ఈ విషయాన్ని కవర్ చేయడంతో  అంజిరెడ్డి నిర్వహిస్తున్న రైతు మ్యారేజ్‌ బ్యూరోకు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఏపీ నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. పెళ్లి సంబంధాల కోసం వచ్చే వారు కేవలం రూ. 500 ఇచ్చి తమ పూర్తి బయోడేటాతో ప్రొఫైల్‌ను నమోదు చేసుకోవాలి. మరీ పేదవారైతే ఆ మొత్తం కూడా తీసుకోకుండా ఫ్రీగా సేవలు అందిస్తామని అంజిరెడ్డి చెబుతున్నారు.

Also Read :

ఇది విన్నారా..! భర్తకు భరణం ఇవ్వాలని భార్యను ఆదేశించిన కోర్టు

సినిమాను తలదన్నే సీన్.. చిన్నారిని కాపడటానికి నాన్-స్టాప్‌గా 200 కి.మీ…

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు