వైరల్‌గా మారిన కాజల్ తనకు కాబోయే భర్తతో దిగిన ఫొటోలు

అగ్రకథానాయిక కాజల్‌ అగర్వాల్‌ తనకు కాబోయే భర్తతో దిగిన ఫొటోలను సోషల్‌మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.  తన ప్రియనేస్తం గౌతమ్‌ కిచ్లూతో త్వరలో ఏడడుగుల వేయనున్నానని కాజల్‌ అక్టోబర్‌ ఆరంభంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పెళ్లి శుభవార్త చెప్పడానికి ముందు...

వైరల్‌గా మారిన కాజల్ తనకు కాబోయే భర్తతో దిగిన ఫొటోలు
Sanjay Kasula

|

Oct 26, 2020 | 10:05 PM

అగ్రకథానాయిక కాజల్‌ అగర్వాల్‌ తనకు కాబోయే భర్తతో దిగిన ఫొటోలను సోషల్‌మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.  తన ప్రియనేస్తం గౌతమ్‌ కిచ్లూతో త్వరలో ఏడడుగుల వేయనున్నానని కాజల్‌ అక్టోబర్‌ ఆరంభంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పెళ్లి శుభవార్త చెప్పడానికి ముందు, ఆ తర్వాత కానీ కాజల్‌ తనకు కాబోయేవాడితో దిగిన ఫొటోలు షేర్‌ చేయలేదు. దీంతో ఈ జంట లేటస్ట్‌ ఫొటోలు చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు.

తాజాగా కాజల్‌.. గౌతమ్‌ కిచ్లూతో దసరా వేడుకలు జరుపుకొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ఫొటోలకు పోజులిచ్చారు. వీటిని ఆమె ఇన్‌స్టా వేదికగా ఫ్యోన్స్‌తో షేర్ చేసుకున్నారు. ‘మా తరఫున మీ అందరికీ దసరా శుభాకాంక్షలు’ అంటూ పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు చూసిన అభిమానులు ‘సూపర్‌ కపుల్‌, మీరు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటివరకూ ఈ ఫొటోలను లక్షల మంది వీక్షించారు. మరోవైపు కాజల్‌ సోదరి నిషా అగర్వాల్‌ సైతం కాబోయే బావగారితో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశారు. అలాగే గౌతమ్‌ సైతం సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటో షేర్‌ చేస్తూ.. ‘ప్రీ వెడ్డింగ్‌ పెస్టివల్స్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.

View this post on Instagram

Happy Dussehra from us to you ! @kitchlug #kajgautkitched

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

తెలుగులో తెరకెక్కుతోన్న ‘మోసగాళ్లు’ చిత్రంలో కాజల్‌ నటిస్తున్నారు. దీంతోపాటు చిరంజీవి కథానాయకుడిగా రానున్న ‘ఆచార్య’ సినిమాలో కాజల్‌ సందడి చేయనున్నారు. అయితే పెళ్లి అనంతరం తాను సినిమాల్లోనే కొనసాగుతానని కాజల్‌ వెల్లడించిన విషయం తెలిసిందే.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu