ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి అంటున్నాడు.. ఏమి నిరూపించారు.? : చంద్రబాబునాయుడి ఆగ్రహం

పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారు.. స్పష్టమైన సమాధానం చెప్పాలి.. అని జగన్ సర్కారుని డిమాండ్ చేశారు టిడిపి అధినేత చంద్రబాబు..

ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి అంటున్నాడు.. ఏమి నిరూపించారు.? : చంద్రబాబునాయుడి ఆగ్రహం
Follow us
Venkata Narayana

| Edited By: Balaraju Goud

Updated on: Dec 03, 2020 | 6:18 AM

పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారు.. స్పష్టమైన సమాధానం చెప్పాలి.. అని జగన్ సర్కారుని డిమాండ్ చేశారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. టిడిపి హయాంలోనే 70 శాతం ప్రాజెక్టు వర్క్ పూర్తి చేశామని వెల్లడించారు. కేసుల కోసం రాజీపడితే చరిత్ర హీనులుగా మిగులుతారన్న ఆయన, రివర్స్ టెండరింగ్ తో తీవ్ర నష్టం జరిగిందని చెప్పారు. ప్రాజక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి అంటున్నాడు.. ఏమి నిరూపించారు.. గాడిదలు కాశారా.? అని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి ఒక్క ప్రకటన కూడా రాలేదన్న చంద్రబాబు, ఎన్నో విచారణలు చేశారు.. చేతనైతే నిరూపించండి.. లేకపోతే నోరు మూసుకోండి అంటూ ఏపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం నిర్మించే ప్రాజెక్టు కనుక తమ హయాంలో ప్రజల్ని తీసుకువెళ్లి చూపించాము.. అక్కడికి వెళుతుంటే సీపీఐ నేతల్ని అడ్డుకున్నారు అని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంలో 63 వేల కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టాము.. ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు.