AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా కష్టాల పరిష్కారానికి టీడీపీ వెబ్‌సైట్

TDP launched a special website for Covid problems redress: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్న విపక్ష తెలుగుదేశం పార్టీ ప్రజల ఇబ్బందుల పరిష్కారానికి ప్రత్యేక వెబ్‌సైట్‌ను లాంచ్ చేసింది. ఏపీ ఫైట్స్ కరోనా (AP Fights Corona) పేరిట రూపొందించిన వెబ్‌సైట్‌ను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించారు. జగన్ ప్రభుత్వం కరోనా నియంత్రణలో విఫలమైందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ వ్యాప్తి […]

కరోనా కష్టాల పరిష్కారానికి టీడీపీ వెబ్‌సైట్
Rajesh Sharma
|

Updated on: Oct 03, 2020 | 5:04 PM

Share

TDP launched a special website for Covid problems redress: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్న విపక్ష తెలుగుదేశం పార్టీ ప్రజల ఇబ్బందుల పరిష్కారానికి ప్రత్యేక వెబ్‌సైట్‌ను లాంచ్ చేసింది. ఏపీ ఫైట్స్ కరోనా (AP Fights Corona) పేరిట రూపొందించిన వెబ్‌సైట్‌ను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించారు. జగన్ ప్రభుత్వం కరోనా నియంత్రణలో విఫలమైందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా కొనసాగుతున్న తరుణంలో ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చంద్రబాబు అన్నారు. ప్రజల ఇబ్బందులను పరిష్కరించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. వైరస్ నియంత్రణలోను ప్రభుత్వం ఫెయిలయ్యిందన్నది చంద్రబాబు వాదన. కరోనా కేసుల్లో దేశంలో రెండో స్థానానికి చేరువవుతున్న తరుణంలో ఏపీ ప్రజల ఇబ్బందులను ఎవరో ఒకరు పరిష్కరించాల్సిన అవసరం వుందని ఆయనంటున్నారు.

ఏపీ ప్రజల ఇబ్బందుల పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ ఒక వేదికను ఏర్పాటు చేయాలని తలపెట్టిందని, అందుకే ఏపీ ఫైట్స్ కరోనా (AP Fights Corona) పేరిట ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించామని టీడీపీ అధినేత తెలిపారు. అక్టోబర్ 3 నుంచి బహిరంగ వేదిక ( ఓపెన్ ఫోరమ్)ను టీడీపీ ఏర్పాటు చేయనున్నదని ఆయన తెలిపారు. కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారెవరైనా తమ క‌ష్టనష్టాలను ఏపీ ఫైట్స్ కరోనా (AP Fights Corona)కు తెలియజేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Also read: బోరబండకు అక్టోబర్ భయం.. అప్పట్లో ఏం జరిగిందంటే?

Also read: శౌర్య క్షిపణి ప్రయోగం సక్సెస్.. స్పెషాలిటీ ఇదే