ఏడాదికి రూ.10లక్షలు దాటిందో.. పన్ను బాదుడే
నల్లధనాన్ని తగ్గించడం, డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించడంలో భాగంగా మరో పోటుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమౌతోంది. బ్యాంకుల నుంచి ఏడాదిలో రూ.10లక్షల డబ్బును విత్ డ్రా చేసే వారికి ట్యాక్స్ విధించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 3 నుంచి 5శాతం ట్యాక్స్ కట్టేలా.. కొత్త నిబంధన తీసుకురావాలని, దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఎక్కువ మొత్తం విత్ డ్రా చేయాలంటే ఆధార్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలా చేయడం ద్వారా వ్యక్తుల లావాదేవీలను సులభంగా […]
నల్లధనాన్ని తగ్గించడం, డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించడంలో భాగంగా మరో పోటుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమౌతోంది. బ్యాంకుల నుంచి ఏడాదిలో రూ.10లక్షల డబ్బును విత్ డ్రా చేసే వారికి ట్యాక్స్ విధించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 3 నుంచి 5శాతం ట్యాక్స్ కట్టేలా.. కొత్త నిబంధన తీసుకురావాలని, దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఎక్కువ మొత్తం విత్ డ్రా చేయాలంటే ఆధార్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలా చేయడం ద్వారా వ్యక్తుల లావాదేవీలను సులభంగా ట్రాక్ చేయొచ్చని కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం.
సాధారణంగా చాలా మంది వ్యక్తులకు, వ్యాపారాలకు ఏడాదికి రూ.10లక్షలకు మించి విత్ డ్రా చేయాల్సిన అవసరం ఉండదని భావిస్తోంది. అందుకే రూ.10లక్షలకు పైగా విత్ డ్రా చేసేవారిపై పన్ను విధించాలని కేంద్రం భావిస్తోందట. అయితే ఇది కేవలం ప్రతిపాదన మాత్రమేనని, దీనిపై చర్చలు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే మరోవైపు పేద, మద్య తరగతి ప్రజలపై ఎలాంటి భారం పడకుండా కేంద్రం జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఆన్‌లైన్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఇటీవల నెఫ్ట్, ఆర్టీజీఎస్ ఛార్జీలను తొలగిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.