ఏపీ సెక్రటేరియేట్‌లో కత్తి మహేష్.. అందుకే..
తెలుగు టీవీ రియాల్టీ షో బిగ్ బాస్ ద్వారా గుర్తింపు పొందిన సినీ క్రిటిక్ కత్తి మహేష్.. చాలా రోజుల తర్వాత తాజాగా ఏపీ సచివాలయంలో హడావిడి చేస్తూ కనిపించాడు. ఇటీవల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఛాంబర్‌కి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. కత్తి మహేష్, మంత్రి పెద్దిరెడ్డి ఇద్దరూ ఒకే జిల్లాకు చెందినవారు. ఈ నేపథ్యంలో సొంత జిల్లా మంత్రికి శుభాకాంక్షలు చెప్పడానికి కత్తి మహేష్ అక్కడికి వెళ్లినట్లు సమాచారం. ఏపీ సీఎం క్యాంపు […]
తెలుగు టీవీ రియాల్టీ షో బిగ్ బాస్ ద్వారా గుర్తింపు పొందిన సినీ క్రిటిక్ కత్తి మహేష్.. చాలా రోజుల తర్వాత తాజాగా ఏపీ సచివాలయంలో హడావిడి చేస్తూ కనిపించాడు. ఇటీవల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఛాంబర్‌కి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. కత్తి మహేష్, మంత్రి పెద్దిరెడ్డి ఇద్దరూ ఒకే జిల్లాకు చెందినవారు. ఈ నేపథ్యంలో సొంత జిల్లా మంత్రికి శుభాకాంక్షలు చెప్పడానికి కత్తి మహేష్ అక్కడికి వెళ్లినట్లు సమాచారం. ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలోని పెద్దల సభలో తెలుగు పెద్ద పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ పుస్తకాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, నేషనల్ జ్యూడీషియల్ అకాడమి డైరెక్టర్ జస్టిస్ గోడ రఘురామ్ తదితరులు హాజరయ్యారు.