మిస్సైన ఏఎన్-32 విమాన శకలాల గుర్తింపు
ఈ నెల 3న అదృశ్యమైన భారత వైమానిక దళ ఏఎన్-32 విమాన శకలాలను గుర్తించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని లిపోకు 16కిలో మీటర్ల దూరంలో ఈ శకలాలు కనిపించినట్లు వైమానిక దళ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా 13మందితో ఈ నెల 3న అసోంలోని బొర్హాత్ ఎయిర్‌బేస్ నుంచి మధ్యాహ్నం 12.24గంటలకు ఏఎన్-32 విమానం బయలుదేరింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని మెచుకా అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్‌కు వెళ్తుండగా.. ఈ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్ అయిందని […]
ఈ నెల 3న అదృశ్యమైన భారత వైమానిక దళ ఏఎన్-32 విమాన శకలాలను గుర్తించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని లిపోకు 16కిలో మీటర్ల దూరంలో ఈ శకలాలు కనిపించినట్లు వైమానిక దళ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా 13మందితో ఈ నెల 3న అసోంలోని బొర్హాత్ ఎయిర్‌బేస్ నుంచి మధ్యాహ్నం 12.24గంటలకు ఏఎన్-32 విమానం బయలుదేరింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని మెచుకా అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్‌కు వెళ్తుండగా.. ఈ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్ అయిందని అధికారులు తెలిపారు. అప్పటి నుంచి ఈ విమానం జాడను తెలుసుకునేందుకు అధికారుల ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఈ విమాన జాడను తెలిపిన వారికి రూ.5లక్షల నజరానా అందజేస్తామని భారత వైమానిక దళం ప్రకటించిన విషయం తెలిసిందే.