రోజాకు సీఎం జగన్ పిలుపు
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్‌లో ఖచ్చితంగా చోటు లభిస్తుంది అని అనుకున్న నేతల్లో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఒకరు. అనూహ్యంలో ఏపీ సీఎం జగన్ తొలి కాబినెట్‌లో ఈ అగ్రెసీవ్ మహిళా నేతకు చోటు దొరకలేదు. దీంతో రోజా అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణలో తనకు కచ్చితంగా చోటు దక్కుతుందని ఆశించిన రోజా… మంత్రి పదవి రాకపోవడంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి […]
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్‌లో ఖచ్చితంగా చోటు లభిస్తుంది అని అనుకున్న నేతల్లో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఒకరు. అనూహ్యంలో ఏపీ సీఎం జగన్ తొలి కాబినెట్‌లో ఈ అగ్రెసీవ్ మహిళా నేతకు చోటు దొరకలేదు. దీంతో రోజా అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణలో తనకు కచ్చితంగా చోటు దక్కుతుందని ఆశించిన రోజా… మంత్రి పదవి రాకపోవడంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా ఆవిడ హాజరు కాలేదు. మంత్రివర్గ విస్తరణ, కేబినెట్ భేటీ అనంతరం ఈ అంశంపై దృష్టి పెట్టినట్టు కనిపించిన ఏపీ సీఎం వైఎస్ జగన్… ఆమెను అమరావతి రావాలని ఆదేశించారు. దీంతో రోజా సీఎం జగన్‌తో అమరావతిలో భేటీ కానున్నారు.
మరోవైపు రెండున్నరేళ్ల తరువాత కేబినెట్‌లోని 90శాతం మంత్రులను మారుస్తానని ప్రకటించిన సీఎం వైఎస్ జగన్… అప్పుడు మంత్రి పదవి ఇస్తానని రోజాకు హామీ ఇచ్చే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అప్పటివరకు తాను ఇచ్చే నామినేటెడ్ పదవిలో కొనసాగాలని సీఎం జగన్ రోజాను కోరితే ఆమె కొనసాగే ఛాన్స్ ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి మంత్రి పదవి దక్కకపోవడంతో నిరాశలో ఉన్న రోజా… జగన్ బుజ్జగింపులతో కూల్ అవుతారేమో చూడాలి.