కరోనా తర్వాత తమన్నా ఎక్సర్‌సైజ్ వీడియో

హీరోయిన్ తమన్నా కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకుంది. బ్యాక్ టు ఫిజికల్ ఫిట్ నెస్ అంటూ ఎక్సర్ సైజ్ చేస్తూ తాజాగా ఒక వీడియో రిలీజ్ చేసింది. ముంబయిలోని తమ అపార్ట్మెంట్ గ్రౌండ్ లో కసరత్తులు చేస్తూ తన ఫిట్ నెస్ లెవెల్స్ ను చాటి చెప్పింది. తమన్నా సాధారణంగానే ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యమిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు కరోనాను జయించిన ఆనందంలో రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ ఫిట్ నెస్ సాధన […]

కరోనా తర్వాత తమన్నా ఎక్సర్‌సైజ్ వీడియో
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 16, 2020 | 3:19 PM

హీరోయిన్ తమన్నా కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకుంది. బ్యాక్ టు ఫిజికల్ ఫిట్ నెస్ అంటూ ఎక్సర్ సైజ్ చేస్తూ తాజాగా ఒక వీడియో రిలీజ్ చేసింది. ముంబయిలోని తమ అపార్ట్మెంట్ గ్రౌండ్ లో కసరత్తులు చేస్తూ తన ఫిట్ నెస్ లెవెల్స్ ను చాటి చెప్పింది. తమన్నా సాధారణంగానే ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యమిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు కరోనాను జయించిన ఆనందంలో రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ ఫిట్ నెస్ సాధన వైపు అడుగులేసింది మిల్కీ బ్యూటీ. వార్మప్ ఎక్సర్ సైజ్‌లతో స్టామినా పుంజుకునేందుకు ప్రస్తుతం తేలికపాటి వ్యాయామం మాత్రమే చేస్తున్నానని తమన్నా చెప్పింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఫిట్ నెస్ సంతరించుకోవడం చాలా ముఖ్యమని, వ్యాయామం తప్పనిసరి అని ఆమె తన సందేశంలో పేర్కొంది. శరీరం చెప్పేది వింటూ ముందుకు పోతుండాలని సూచించింది.