తమన్నా ఇంట కరోనా కలకలం
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా పేరెంట్స్ కు కరోనా అటాక్ అయింది. ఈ విషయాన్ని స్వయంగా తమన్నానే వెల్లడించారు. గత వారాంతంనుంచీ తన తల్లిదండ్రులలో స్వల్ప కొవిడ్ లక్షణాలు కనిపించాయని..

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా పేరెంట్స్ కు కరోనా అటాక్ అయింది. ఈ విషయాన్ని స్వయంగా తమన్నానే వెల్లడించారు. గత వారాంతంనుంచీ తన తల్లిదండ్రులలో స్వల్ప కొవిడ్ లక్షణాలు కనిపించాయని.. దీంతో ఫ్యామిలీ అంతా ముందస్తు జాగ్రత్తలు పాటించామని వెల్లడించింది. ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఇంట్లోనే ఉంటూ కొవిడ్ పరీక్షలు చేయించుకున్నామని తెలిపింది. అయితే, ఆ పరీక్షా ఫలితాలు ఇప్పుడే వచ్చాయని.. దురద్రుష్టవశాత్తూ తన తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పింది. అయితే, తనతో సహా స్టాఫ్, మిగతా కుటుంబసభ్యులెవరికీ వైరస్ సోకలేదని పేర్కొంది.దేవునిదయ వల్ల తన పేరెంట్స్ కోలుకొంటున్నారని.. మీ అందరి ఆదరాభిమానాలతో కరోనా నుంచి బయటపడతారని ఆశాభావం వ్యక్తం చేసింది.
— Tamannaah Bhatia (@tamannaahspeaks) August 26, 2020


