విదేశీ ఉద్యోగులకు కువైట్ కొత్త రూల్స్

మెరుగైన జీతభత్యాల నిమిత్తం భారతదేశానికి చెందిన అనేక మంది గల్ఫ్ దేశాలకు.. ముఖ్యంగా కువైట్ కు వెళ్లడం ఏళ్లుగా వస్తోంది. అనేక మంది స్త్రీ, పురుషులు అక్కడ వివిధ రకాల పనుల్లో..

  • Pardhasaradhi Peri
  • Publish Date - 3:25 pm, Wed, 26 August 20
విదేశీ ఉద్యోగులకు కువైట్ కొత్త రూల్స్

మెరుగైన జీతభత్యాల నిమిత్తం భారతదేశానికి చెందిన అనేక మంది గల్ఫ్ దేశాలకు.. ముఖ్యంగా కువైట్ కు వెళ్లడం ఏళ్లుగా వస్తోంది. అనేక మంది స్త్రీ, పురుషులు అక్కడ వివిధ రకాల పనుల్లో ఉపాది పొందుతున్నారు. అయితే, తాజాగా విదేశీ వర్కర్లు, ఉద్యోగుల విషయంలో కువైట్ ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. 60 ఏళ్లు దాటిన విదేశీయులను ఇకపై పనుల్లోకి తీసుకోరు. అదేవిధంగా యూనివర్సిటీ డిగ్రీ లేనివారికి కూడా ఇకపై వర్క్ పర్మిట్ ఇవ్వకూడదని నిర్ణయించారు. ఇప్పటికే 59 ఏళ్లు దాటిన వారి వర్క్ పర్మిట్ ను ఒక ఏడాదికి మాత్రం పొడిగించి స్వదేశానికి పంపించనున్నారు. 2021 జనవరి 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. దీనివల్ల అనేకమంది విదేశీ ఉద్యోగులపై ప్రభావం పడుతుంది. ప్రస్తుతం కువైట్ లో విదేశీ పనివారు 3,65,000 మంది వుండగా, వీరిలో 1,55,000 మంది అరవై ఏళ్లు పైబడిన వాళ్లు ఉన్నారని కువైట్ అధికారిక లెక్కలు చెబుతున్నాయి.