‘ కండోమ్స్‌ని తీసుకెళ్లండి.. రేప్స్‌ని ఒప్పుకోండి’.. ఎవరీ దుర్మార్గుడు ?

' కండోమ్స్‌ని తీసుకెళ్లండి.. రేప్స్‌ని ఒప్పుకోండి'.. ఎవరీ దుర్మార్గుడు ?

తనను ఫిల్మ్ మేకర్ గా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి యువతులను ఉద్దేశించి దారుణంగా చేసిన ఓ పోస్ట్ నెట్ లో వైరల్ కాగా.. నెటిజన్లు, అమ్మాయిలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. డేనియల్ శ్రవణ్ అనే ఈ వ్యక్తి.. రేప్ రిలేటెడ్ మర్డర్స్ ఆగిపోవాలంటే కండోమ్స్ తీసుకెళ్లాలని, అత్యాచారానికి అంగీకరించాలని తన ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు. (తన సోషల్ మీడియా ఖాతాలను ఆ తరువాత తొలగించాడు). 18 ఏళ్ళు పైబడిన అమ్మాయిలను రేప్ గురించి ఎడ్యుకేట్ చేయాలనీ, […]

Pardhasaradhi Peri

| Edited By:

Dec 04, 2019 | 6:51 PM

తనను ఫిల్మ్ మేకర్ గా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి యువతులను ఉద్దేశించి దారుణంగా చేసిన ఓ పోస్ట్ నెట్ లో వైరల్ కాగా.. నెటిజన్లు, అమ్మాయిలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. డేనియల్ శ్రవణ్ అనే ఈ వ్యక్తి.. రేప్ రిలేటెడ్ మర్డర్స్ ఆగిపోవాలంటే కండోమ్స్ తీసుకెళ్లాలని, అత్యాచారానికి అంగీకరించాలని తన ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు. (తన సోషల్ మీడియా ఖాతాలను ఆ తరువాత తొలగించాడు).

18 ఏళ్ళు పైబడిన అమ్మాయిలను రేప్ గురించి ఎడ్యుకేట్ చేయాలనీ, మగవారి లైంగిక వాంఛలకు వారు నో చెప్పరాదని డేనియల్ అన్నాడు. అసలే హైదరాబాద్ లో దిశ ఉదంతం పై దేశ వ్యాప్త ఆందోళన జరుగుతుండగా ఇతగాడు ఇలా అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పోస్టింగులు పెట్టడాన్ని మహిళాలోకం జీర్ణించుకోలేకపోతోంది. ముఖ్యంగా భారతీయ యువతులకు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి తెలుసునని, 18 ఏళ్ళు పైబడినవారు కండోమ్ లు, డెంటల్ డ్యామ్ లను తీసుకువెళ్తుంటారని డేనియల్ అన్నాడు. తనది సింపుల్ లాజిక్ అని, మగవారి కోర్కెలు తీరితే మహిళలు వారిని చంపరని పేర్కొన్నాడు. రేపిస్టులంటే ఈ ప్రభుత్వం భయపడుతోందా అని ప్రశ్నించాడు. . ఇలా ఇంకా వీరప్పన్, ఒసామా బిన్ లాడెన్ వంటి వారిగురించి ప్రస్తావించాడు.  ఇతడి పోస్టులు చూసిన యువతులు, నెటిజన్లు భగ్గుమంటూ… తమదైన శైలిలో చీల్చి చెండాడేశారు .

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu