కరోనా కట్టడిలో కేంద్రం భేష్… సుప్రీంకోర్టు తాజా ఆదేశాలివే

కరోనా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్రం ప్రశంసించింది. అయితే దేశంలో పౌరులందరికీ ఫ్రీగా కరోనా టెస్టులు నిర్వహించాలంటూ గతంలో తామే ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సవరించింది.

కరోనా కట్టడిలో కేంద్రం భేష్... సుప్రీంకోర్టు తాజా ఆదేశాలివే
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 13, 2020 | 6:39 PM

కరోనా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్రం ప్రశంసించింది. అయితే దేశంలో పౌరులందరికీ ఫ్రీగా కరోనా టెస్టులు నిర్వహించాలంటూ గతంలో తామే ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సవరించింది. బీపీఎల్‌కు ఎగువన వున్న ప్రజలందరికోసం ఓ ప్రత్యేక పథకాన్ని కేంద్రం రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫ్రీగా కరోనా పరీక్షలు చేయాలన్న ఆదేశాలను సవరించాలని దాఖలు అయిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిపింది.

ఏప్రిల్ 8న ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్‌లలో ఉచితంగా కరోనా పరీక్షలు చేయాలన్న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సవరణలు చేసింది సీజేఐ బొబ్డే సారథ్యంలోని ధర్మాసనం. ఆయుష్మాన్ భారత్ కార్డు ఉన్న వారికి మాత్రమే ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్‌లలో ఉచిత కరోనా పరీక్షలు చేయాలని సూచించింది. దారిద్ర్యరేఖకు ఎగువన ఉన్నవారి కోసం కేంద్ర పథకం రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

87 శాతం కరోనా పరీక్షలు ప్రభుత్వ ల్యాబ్స్ లోనే జరుగుతున్నాయని ఐసీఎంఆర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఆయుష్మాన్ భారత్ కింద 50 కోట్లమందికి లబ్ధి ఉంటుందని తెలిపింది. ఉచిత కరోనా పరీక్షల నిర్వహణతో ప్రైవేటు ల్యాబ్‌లపై భారం పడుతుందని పిటిషనర్ వాదించారు. పరిమిత వనరులతోనే కరోనాపై యుద్ధం చేస్తున్నామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి నివేదించారు. మరో రెండు నెలల పాటు కరోనాపై యుద్ధం చేయాల్సి ఉంటుందన్నారు. 139 ప్రభుత్వ ల్యాబుల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మెహతా తెలిపారు. ప్రభుత్వం కేవలం రెండు ల్యాబులతో మొదలు పెట్టి ఈ స్థాయికి చేరుకోవడానికి విశేష కృషి చేసిందని ధర్మాసనానికి మెహతా నివేదించారు.