AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Super Over: అసలు ఆ రాత్రి ఏం జరిగింది..? ఆకట్టుకుంటోన్న ‘ఆహా’ ‘సూపర్‌ ఓవర్‌’ స్నీక్‌-పీక్‌..

'Aha' New Movie: తెలుగు ప్రేక్షకులకు అసలైన డిజిటల్‌ ఎక్స్‌పీరియన్స్‌ను పరిచయం చేసింది 'ఆహా' ఓటీటీ. తొలి తెలుగు ఓటీటీగా వచ్చిన 'ఆహా' ఆసక్తికరమైన కంటెంట్‌తో..

Super Over: అసలు ఆ రాత్రి ఏం జరిగింది..? ఆకట్టుకుంటోన్న 'ఆహా' 'సూపర్‌ ఓవర్‌' స్నీక్‌-పీక్‌..
Narender Vaitla
|

Updated on: Jan 17, 2021 | 5:36 AM

Share

‘Aha’ New Movie: తెలుగు ప్రేక్షకులకు అసలైన డిజిటల్‌ ఎక్స్‌పీరియన్స్‌ను పరిచయం చేసింది ‘ఆహా’ ఓటీటీ. తొలి తెలుగు ఓటీటీగా వచ్చిన ‘ఆహా’ ఆసక్తికరమైన కంటెంట్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంట్రెన్సింగ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సూపర్‌ ఓవర్‌’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో నవీన్ చంద్ర, చాందిని చౌదరి, ప్రభు, అజయ్, ప్రవీణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ప్రవీణ్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా చిత్ర యూనిట్‌ ఈ సినిమాకు సంబంధించిన స్నీక్‌పీక్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్‌ చేస్తోంది. టీజర్‌ను గమనిస్తే సినిమా చాలా ఆసక్తికరంగా తెరకెక్కినట్లు అనిపిస్తోంది. ఈ వీడియోను గమనిస్తే.. ముగ్గురు వ్యక్తులు ఒక దొంగతనం చేయగా వారిని ఇద్దరు పోలీసులు ఛేజ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథంతా కేవలం ఒక రాత్రి జరిగిన సంఘటనల ఆధారంగా ఉండనుందని మేకర్స్‌ హింట్‌ ఇచ్చారు. ఇక స్నీక్‌పీక్‌లో వచ్చే.. ‘పోలీస్ స్టేషన్ దగ్గర దొంగతనం ఏంట్రా.. ఎంత రిస్కో తెలుసా?.. లైఫ్‌లో రిస్క్ చేస్తేనే డబ్బులొస్తయ్.. దేవుడికి దణ్ణం పెట్టుకుంటే రావు..’ డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే ‘సూపర్‌ ఓవర్‌’ చిత్రాన్ని జనవరి 22 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ చేయనున్నారు.

Also Read: Krack Movie Collections: ‘మరో మాట లేదమ్మా’.. మాస్ మహారాజా ‘క్రాక్’ బ్లాక్‌బాస్టర్.. కలెక్షన్ల కుమ్ముడు