Earthquake: జమ్ముకశ్మీర్‌లో మరోసారి కంపించిన భూమి.. వారం రోజుల్లో ఇది రెండోసారి.. తీవ్రత ఎంతంటే..
Earthquake In Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో మరోసారి భూకంపం సంభవించింది. గత సోమవారం (జనవరి 11) జమ్ముకశ్మీర్‌లోని కిష్వార్ జిల్లాల్లో భూమి కంపించగా ఇప్పుడు మరోసారి..
Earthquake In Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో మరోసారి భూకంపం సంభవించింది. గత సోమవారం (జనవరి 11) జమ్ముకశ్మీర్‌లోని కిష్వార్ జిల్లాల్లో భూమి కంపించగా ఇప్పుడు మరోసారి భూకంపం రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి 10 గంటల సమయంలో భూమి కంపించినట్లు పేర్కొన్నారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.1గా నమోదైందని తెలిపారు. జమ్మూకశ్మీర్‌లోని కాత్రా పట్టణానికి తూర్పు దిశలో 93 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. భూఅంతర్భాగంలో సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు.