Krack Movie Collections: ‘మరో మాట లేదమ్మా’.. మాస్ మహారాజా ‘క్రాక్’ బ్లాక్‌బాస్టర్.. కలెక్షన్ల కుమ్ముడు

జనాలు ఇక థియేటర్లకు వెళ్లరా..? ఓటీటీలతో సర్దకుపోవాల్సిందేనా..? విజిల్స్, అరుపులు, కేకలు, క్రాకర్స్, మైకుల ముందు కాలర్ ఎగరవేయడాలు లాంటివి లేకుండా సినిమాలు చూసేయాల్సిందేనా...?

Krack Movie Collections: 'మరో మాట లేదమ్మా'.. మాస్ మహారాజా 'క్రాక్' బ్లాక్‌బాస్టర్.. కలెక్షన్ల కుమ్ముడు
Follow us

|

Updated on: Jan 16, 2021 | 6:11 PM

Krack Movie Collections:  జనాలు ఇక థియేటర్లకు వెళ్లరా..? ఓటీటీలతో సర్దకుపోవాల్సిందేనా..? విజిల్స్, అరుపులు, కేకలు, క్రాకర్స్, మైకుల ముందు కాలర్ ఎగరవేయడాలు లాంటివి లేకుండా సినిమాలు చూసేయాల్సిందేనా…? కాదు.. కాదు..ఎంతమాత్రం కాదు. ‘క్రాక్’ సినిమా చూసినవారు ఆ మాట చెబితే అస్సలు ఒప్పుకోరు. మల్టిఫ్లెక్స్‌లో సినిమా చూసినవాళ్ల సంగతి తెలియదు కానీ.. పక్కా మాస్ సెంటర్లో సినిమా చూసిన వాళ్లు పైన చెప్పిన మాటలు అంటే ఎగాదిగా చూస్తారు. నిజం.. లాంగ్ గ్యాప్ తర్వాత పక్కా కమర్షియల్ బొమ్మ థియేటర్లతో టాప్ లేపుతోంది. ‘మాస్’ అనే ఎనర్జీ డ్రింక్ తాగినట్లు ఎప్పుడూ పెర్ఫామెన్స్ చేసే రవితాజా.. ఈ సారి ‘ఊర మాస్’ అనే ఎనర్జీ డ్రింక్ తాగినట్లు స్క్రీన్‌పై సింహనాదం చేశాడు. గోపిచంద్ మలినేని రొటీన్ ఫార్ములాలను పక్కనపెట్టి ఫస్ట్ టైమ్ ఓ కొత్త తరహా సినిమాతో అలరించాడు. ఇక థమన్ గురించి చెప్పేది ఏముంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం విషయంలో కుమ్మేశాడు. రవితేజ కనిపించినప్పుడు వచ్చే బ్యాగ్రౌండ్ అయితే అనుభవించాల్సిందే. మొత్తం మీద మాస్ రాజా పొంగల్ దంగల్‌లో పైచేయి సాధించాడు. కలెక్షన్ల ఊచకోతతో ముందుకు సాగుతున్నాడు.

రవితేజ-దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన ఈ హ్యాట్రిక్ చిత్రం విడుదలైన ఐదు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ పాయింట్‌ను క్రాస్ చేసింది.  నైజాం థియేటర్లు తగ్గించారని ‘క్రాక్’ డిస్ట్రిబ్యూటర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నా.. నష్టం అయితే వచ్చే పరిస్థితులు లేవు. నైజాంలో ఇప్పటికే పెట్టిన డబ్బులు వచ్చేసినట్లు తెలుస్తోంది. నైజాంలో ఆరు రోజుల్లో ‘క్రాక్’ రూ.6.65 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ నిపుణులు నుంచి అందుతోన్న సమాచారం. ఈ సినిమా ఫుల్ రన్‌లో నైజాంలో రూ.10 కోట్ల షేర్ వసూలు చేస్తుందని వారు భావిస్తున్నారు. నిజానికి థియేటర్లు ఎక్కువగా ఉండుంటే ‘క్రాక్’ ఈ పాటికే సుమారు రూ.8 కోట్ల షేర్ వసూలు చేసి ఉండేది. మొత్తం మీద ఆరు రోజుల్లో నైజాంలో ‘క్రాక్’ గ్రాస్ రూ.11.5 కోట్లు కాగా.. షేర్ రూ.6.5 కోట్లుగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతోన్న రిపోర్ట్స్ ప్రకారం ‘క్రాక్’ ఆరో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.2.23 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టింది. దీంతో ఆరు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలైన మొత్తం షేర్ విలువ రూ.18.88 కోట్లుగా చెబుతున్నారు.

Also Read: Pongal 2021 Movies: పొంగల్ బరిలో సినిమాల దంగల్.. ఊపు తెచ్చింది ఎవరు..? ఉసూరుమనిపించింది ఎవరు?

చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే