AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Astrology: ఆగస్టు సెకండాఫ్‌లో వారికి డబ్బే డబ్బు! లిస్ట్‌లో మీ రాశి ఉందా?

ఆగస్టు 12 నుంచి 28 వరకు రవి, బుధుల సంచార ప్రభావంతో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు కలిగే అవకాశముంది. ముఖ్యంగా ఆర్థిక, ఉద్యోగ, వృత్తి, గౌరవ ప్రతిష్ఠల పరంగా పురోగతి కనిపించవచ్చు. సింహ రాశిలో రవి, బుధుల సంచారం ఈ రాశుల వారికి కొత్త అవకాశాలు, ఆదాయ మార్గాలు, కీలక విజయాలను అందించే సమయం కావచ్చు. నెలాఖరు వరకు అనుకూల పరిస్థితులు కొనసాగవచ్చు.

Money Astrology: ఆగస్టు సెకండాఫ్‌లో వారికి డబ్బే డబ్బు! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
Money Astrology August 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 10, 2026 | 9:30 PM

Share

ఈ నెల(ఆగస్టు) 12 నుంచి 28 వరకు, అంటే అమావాస్య నుంచి పౌర్ణమి వరకు పక్షం రోజుల పాటు కొన్ని రాశులవారు ఒక వెలుగు వెలగబోతున్నారు. రవి, బుధులు సింహ రాశిలో ప్రవేశిస్తున్నందువల్ల అనేక విధాలుగా అదృష్టం తలుపు తట్టే అవకాశం ఉంది. సింహ రాశి రవికి స్వక్షేత్రం కాగా బుధుడికి మిత్ర క్షేత్రం. ఈ నెల 17న రవి, 22న బుధుడు ఈ రాశిలోకి ప్రవేశిస్తున్న కారణంగా మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, ధనూ రాశుల వారు ఆర్థికంగా, వృత్తి, ఉద్యో గాలపరంగా, పలుకుబడిపరంగా ఏనుగు కుంభ స్థలాన్ని బద్దలు కొట్టే అవకాశం ఉంది. వీరికి అన్ని విధాలా ఇది అనుకూల సమయం. నెలాఖరు వరకూ వీరికి తిరుగుండదు.

మేషం

ఈ రాశికి పంచమ స్థానంలో మొదట రవి, ఆ తర్వాత బుధుడి సంచారం వల్ల ఈ రాశివారు అనేక విషయాల్లో అగ్ర స్థానానికి వెళ్లే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా అందలాలు ఎక్కే అవకాశం ఉంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబం ధాలు ఏర్పడతాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నవారు సక్సెస్ అవుతారు. నిరుద్యోగు లకు అరుదైన అవకాశాలు లభిస్తాయి. సగటు వ్యక్తి సైతం సంపన్నుడయ్యే అవకాశం ఉంది.

వృషభం

ఈ రాశికి చతుర్థ స్థానంలో రవి, బుధుల సంచారం వల్ల ఈ రాశివారికి తప్పకుండా అధికార యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా అందలాలు ఎక్కుతారు. రావ లసిన డబ్బు రావడంతో పాటు షేర్లు, స్పెక్యులేషన్లు, వడ్డీ వ్యాపారాలు లాభాల పంట పండిస్తాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధాలు కుదరవచ్చు. ఆస్తులు వృద్ధి చెందుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.

ఇవి కూడా చదవండి

కర్కాటకం

ధన స్థానంలో రవి, బుధుల సంచారం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. సగటు వ్యక్తి సైతం సంపన్నుడయ్యే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో మీ వల్ల సంస్థకు బాగా డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, వ్యాపా రాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

సింహం

ఈ నెల 17న రాశ్యధిపతి రవి ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుంచి ఈ రాశివారికి పట్టపగ్గాలు ఉండకపోవచ్చు. ఈ నెల 22న బుధుడు కూడా ఈ రాశిలో ప్రవేశించడంతో వీరికి ఆదాయం, ఉద్యో గం బాగా కలిసి వస్తాయి. ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీతో పాటు రాబడి అంచనాల్ని మించడం జరుగుతుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, మదు పులు, పెట్టుబడులతో సహా అనేక విధాలుగా ఆదాయం దిన దినాభివృద్ధి చెందే అవకాశం ఉంది.

తుల

ఈ రాశికి లాభ స్థానంలో లాభాధిపతి రవి, భాగ్యాధిపతి బుధుడి సంచారం వల్ల ఈ రాశివారు అత్యధికంగా ఆర్థిక లాభాలు, పదవీ లాభం పొందే అవకాశం ఉంది. ఉద్యోగపరంగానే కాక, సామా జికంగా కూడా రాజయోగాలు కలుగుతాయి. రాజ పూజ్యాలు పెరుగుతాయి. అనేక వైపుల నుంచి బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపా రాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

వృశ్చికం

ఈ రాశికి దశమ స్థానంలో రవి, బుధుల సంచారం వల్ల జీవనశైలి పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారమవుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి, విదేశీ సంపాదన అనుభవించడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు భారీ జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభిస్తుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురు తుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.

ధనుస్సు

ఈ రాశికి భాగ్య స్థానంలో రవి, బుధుల అనుకూల సంచారం వల్ల ఈ రాశివారికి ధర్మకర్మాధిప యోగమనే అరుదైన యోగం పడుతుంది. దీనివల్ల రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ప్రభుత్వ ఉన్నతోద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఉంది. పేరు ప్రఖ్యాతులు పెరిగే పనులు చేస్తారు. ధన ధాన్య వృద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. కొద్ది ప్రయత్నంతో తప్పకుండా సంపన్నులవుతారు. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి.

Follow Us
ఆగస్టు సెకండాఫ్‌లో ఈ రాశులకు డబ్బే డబ్బు!
ఆగస్టు సెకండాఫ్‌లో ఈ రాశులకు డబ్బే డబ్బు!
భోజనం చేసిన తర్వాత కేవలం 10 నిమిషాలు నడిస్తే ఇన్ని ప్రయోజనాలా..?
భోజనం చేసిన తర్వాత కేవలం 10 నిమిషాలు నడిస్తే ఇన్ని ప్రయోజనాలా..?
ఫోల్డబుల్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించేందుకు షియోమీ ప్లాన్
ఫోల్డబుల్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించేందుకు షియోమీ ప్లాన్
చైనాలో డాల్ఫిన్‌ టైపూన్‌ బీభత్సం.. షాంఘైలో జనజీవనం అస్తవ్యస్తం!
చైనాలో డాల్ఫిన్‌ టైపూన్‌ బీభత్సం.. షాంఘైలో జనజీవనం అస్తవ్యస్తం!
అదిరిపోయే అప్‌డేట్‌తో గూగుల్‌ పిక్సెల్‌ వాచ్
అదిరిపోయే అప్‌డేట్‌తో గూగుల్‌ పిక్సెల్‌ వాచ్
బిగ్‌బాస్ 10లోకి శ్రీముఖి లవర్.. వీడియోతో క్లారిటీ ఇచ్చేశాడుగా.
బిగ్‌బాస్ 10లోకి శ్రీముఖి లవర్.. వీడియోతో క్లారిటీ ఇచ్చేశాడుగా.
బీరకాయ ఎక్కువగా తింటున్నారా? అయితే, ఇది మీ కోసమే! శరీరంలో జరిగేది
బీరకాయ ఎక్కువగా తింటున్నారా? అయితే, ఇది మీ కోసమే! శరీరంలో జరిగేది
తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు.. గెలాక్సీ కొత్త మోడల్
తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు.. గెలాక్సీ కొత్త మోడల్
ఐదుగురు అమ్మాయిలు పుట్టారని మా నాన్న నరకం చూపించాడు..
ఐదుగురు అమ్మాయిలు పుట్టారని మా నాన్న నరకం చూపించాడు..
తలస్నానానికి ముందు ఇలా చేయండి.. చింపిరి జుట్టు కాస్త సిల్కీగా..
తలస్నానానికి ముందు ఇలా చేయండి.. చింపిరి జుట్టు కాస్త సిల్కీగా..