AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sun Transit 2026: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే! ధనలాభం, ఉద్యోగ యోగం

సూర్యుడు ఆగస్టు 17న స్వక్షేత్రమైన సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. సూర్యుడి ఈ సంచారం కొన్ని రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, గౌరవం వంటి విషయాల్లో అనుకూల ఫలితాలు దక్కనున్నాయి. ముఖ్యంగా కొత్త ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఉద్యోగం దక్కే అవకాశముంది. ఉద్యోగ మార్పు కోరుకునే వారికి, పదోన్నతులు ఆశిస్తున్న వారికి కూడా ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది.

Sun Transit 2026: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే! ధనలాభం, ఉద్యోగ యోగం
Sun Transit 2026Image Credit source: AI
Janardhan Veluru
|

Updated on: Aug 08, 2026 | 12:18 PM

Share

జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు. ఆత్మవిశ్వాసం, అధికారం, గౌరవం, నాయకత్వం, ఉద్యోగం వంటి అంశాలకు సూర్యుడు కారకుడిగా భావిస్తారు. సూర్యుడు ప్రతి నెలా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ క్రమంలో 2026 ఆగస్టు 17న సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. నెల రోజుల పాటు అంటే సెప్టెంబర్ 17 వరకు సూర్యుడు ఆ రాశిలో సంచారం కొనసాగిస్తాడు. సింహరాశి సూర్యుడి స్వక్షేత్రం కావడంతో ఈ సంచారానికి జ్యోతిష్యపరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని నమ్ముతారు.

సూర్యుడి సింహరాశి సంచారం ముఖ్యంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. చాలాకాలంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త అవకాశాలు దక్కే అవకాశముంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లేదా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. కొన్ని రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, గౌరవం వంటి విషయాల్లో అనుకూల ఫలితాలు లభించే అవకాశం ఉంది.

  1. సింహ రాశి: సూర్యుడు తన సొంత రాశి అయిన సింహంలోకి ప్రవేశించడం వల్ల సింహరాశి వారికి ఈ కాలం శుభదాయకంగా ఉంటుంది. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది ఉద్యోగంలో బాధ్యతలు పెరగడంతో పాటు గుర్తింపు, గౌరవం లభించే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తాయి. ఆదాయం పెరిగే అవకాశాలు ఉండటంతో పాటు పెట్టుబడుల విషయంలో కూడా అనుకూల ఫలితాలు రావచ్చని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. విదేశీ ప్రయాణాలకు సంబంధించిన అవకాశాలు కూడా ఏర్పడవచ్చు.
  2. తుల రాశి: ఈ వారికి ఉద్యోగ, వృత్తి రంగాల్లో కొత్త అవకాశాలకు అవకాశముంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఆఫీసులో మీ పనితీరుకు గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో జీతం పెంపు, ఉద్యోగ పదోన్నతులకు అవకాశముంది. కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహించడం ద్వారా ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు లేదా కొత్త కస్టమర్ల ద్వారా ప్రయోజనం పొందే అవకాశముంది. ముఖ్యమైన విషయాల్లో స్నేహితుల సాయం అందుతుంది. ఇంకా పెళ్లి కానివారికి వివాహం కుదిరే అవకాశముంది. వాహనం, ఆస్తి కొనుగోలుకు అనుకూలత ఉంది.
  3. ఇవి కూడా చదవండి
  4. మకర రాశి: సింహరాశిలో సూర్య సంచారం మకరరాశి వారికి శుభ యోగాలను తీసుకొస్తుంది. ఆకస్మిక ఆర్థిక లాభాలు చేకూరే అవకాశాలున్నాయి. చాలా కాలంగా చేతికందని డబ్బును తిరిగి పొందే అవకాశం కూడా ఉంది. ఉద్యోగస్తులకు వారి పై అధికారుల మెప్పు పొందుతారు. పని ప్రదేశంలో మీ ప్రతిష్ట బలపడుతుంది. వ్యాపారవేత్తలు కొత్త కస్టమర్లు, మంచి లాభాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలంగా ఉంటుంది. పెట్టుబడుల నుండి లాభాలు పెరిగే అవకాశం కూడా ఉంది. కుటుంబంతో సంబంధాలు మెరుగుపడతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

(గమనిక: ఈ కథనంలోని అంశాలు జ్యోతిష్య విశ్వాసాలు, సాధారణ రాశి ఆధారిత అంచనాలపై ఆధారపడినవి. వ్యక్తిగత జాతకంలోని గ్రహస్థితులు, దశలు, లగ్నం, చంద్రరాశి తదితర అంశాల ఆధారంగా ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు.)

Follow Us
రవి కటాకంతో ఈ రాశుల వారికి ధనలాభం, ఉద్యోగ యోగం..!
రవి కటాకంతో ఈ రాశుల వారికి ధనలాభం, ఉద్యోగ యోగం..!
ఒకే ఒక్క స్పూన్ చాలు.. దెబ్బకు షుగర్, నరాల వీక్ నెస్ సెట్టు
ఒకే ఒక్క స్పూన్ చాలు.. దెబ్బకు షుగర్, నరాల వీక్ నెస్ సెట్టు
బీఎండబ్ల్యూ బైక్‌పై ఉబర్ రైడర్!జెన్‌జీ మాట, బిజినెస్ ఫౌండర్‌ ఫిదా
బీఎండబ్ల్యూ బైక్‌పై ఉబర్ రైడర్!జెన్‌జీ మాట, బిజినెస్ ఫౌండర్‌ ఫిదా
అలా అయితే వీలునామా చెల్లదా.. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల ఆస్తి..
అలా అయితే వీలునామా చెల్లదా.. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల ఆస్తి..
జీవితం మీద నిరాశ కలిగితే స్మశానానికి వెళ్లి కూర్చుంటా..
జీవితం మీద నిరాశ కలిగితే స్మశానానికి వెళ్లి కూర్చుంటా..
గిల్‌కు ఏమైంది? అత్యవసర సమావేశం తర్వాత ఆందోళనలో గంభీర్
గిల్‌కు ఏమైంది? అత్యవసర సమావేశం తర్వాత ఆందోళనలో గంభీర్
అధికారుల కళ్లగప్పి తప్పించుకున్న పెద్దపులి..!
అధికారుల కళ్లగప్పి తప్పించుకున్న పెద్దపులి..!
పొట్ట కొవ్వు కరిగించి, బరువును తగ్గించే సూపర్ డ్రింక్..
పొట్ట కొవ్వు కరిగించి, బరువును తగ్గించే సూపర్ డ్రింక్..
మీ బట్టలు తెల్లగా మెరవాలా? వాషింగ్‌ మెషిన్‌లో పారాసెటమాల్‌ వేయండి
మీ బట్టలు తెల్లగా మెరవాలా? వాషింగ్‌ మెషిన్‌లో పారాసెటమాల్‌ వేయండి
రూ.340 చెల్లిస్తే చాలు నెల మొత్తం ఎన్ని సార్లు అయినా తిరగొచ్చు..!
రూ.340 చెల్లిస్తే చాలు నెల మొత్తం ఎన్ని సార్లు అయినా తిరగొచ్చు..!