AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: మాటలతోనే మాయ చేస్తారు..! కమ్యూనికేషన్ పవర్‌తో మనసు గెలిచే రాశులివే..

తమ మాటకారితనంతో ఇతరుల మనసును గెలిచే ట్యాలెంట్ కొందిరికే ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు, శుక్రుడి ప్రభావం ఉన్నవారిలో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, తెలివితేటలు, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కనిపిస్తాయి. ముఖ్యంగా కొన్ని రాశుల వారు తమ మాటలతో ఇతరుల మనసును సులభంగా గెలుచుకుంటారని జ్యోతిష్య విశ్లేషణలు చెబుతున్నాయి.

Zodiac Signs: మాటలతోనే మాయ చేస్తారు..! కమ్యూనికేషన్ పవర్‌తో మనసు గెలిచే రాశులివే..
Best Communication SkillsImage Credit source: AI
Janardhan Veluru
|

Updated on: Aug 08, 2026 | 12:44 PM

Share

ప్రతి వ్యక్తి మాట్లాడే విధానం, ఎదుటివారితో వ్యవహరించే తీరు భిన్నంగా ఉంటుంది. కొందరు తమ జ్ఞానంతో ఆకట్టుకుంటే.. మరికొందరు తమ మాటతీరుతో ఎదుటివారి మనసును గెలుచుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి సహజంగానే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రంలో బుధుడు మాట, సంభాషణ, తర్కానికి కారకుడిగా పరిగణిస్తారు. ఇక శుక్రుడు ఆకర్షణ, కళలు, వ్యక్తిత్వానికి ప్రతీకగా భావిస్తారు. జాతకంలో ఈ గ్రహాలు బలంగా ఉన్నవారు తెలివిగా, ఆకర్షణీయంగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. తమ ప్రేమను వ్యక్తంచేయడమే కాదు.. వ్యాపారంలో తమ ఉత్పత్తిని విక్రయించడంలోనూ తమ మాటకారితనంతో అనుకున్నది సాధిస్తారు. ఈ లక్షణాలు కొన్ని రాశుల వారిలో ప్రత్యేకంగా కనిపిస్తాయి.

వృషభ రాశి

ఈ రాశి వారికి సాధారణంగా మృదువుగా, ఆలోచించి మాట్లాడే స్వభావం ఉంటుంది. ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పగలుగుతారు. వీరు మాట్లాడేటప్పుడు తొందరపడకుండా విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకుని స్పందిస్తారు. దీంతో వీరి మాటలు ఎదుటివారిపై మంచి ప్రభావాన్ని చూపుతాయి. ప్రశాంతమైన వ్యక్తిత్వం, మాటతీరుతో ఇతరుల మనసును గెలుచుకుంటారు. తమ లక్ష్యాల విషయంలో కూడా వీరు చాలా పట్టుదలగా ఉంటారు. అందుకే వృషభ రాశి వారితో స్నేహం చేయడానికి చాలామంది ఆసక్తి చూపుతారని జ్యోతిష్య పండితులు చెబుతారు.

మిథున రాశి

మిథున రాశికి అధిపతి బుధుడు. అందుకే ఈ రాశి వారికి అద్భుతమైన సంభాషణా నైపుణ్యాలు ఉంటాయని జ్యోతిష్యులు చెబుతారు. ఏ విషయాన్నైనా తార్కికంగా, తెలివిగా వివరించే సామర్థ్యం వీరికి ఉంటుంది. సందర్భానికి అనుగుణంగా మాట్లాడటం, ఎదుటివారి మాటలను అర్థం చేసుకుని స్పందించడం వీరి ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ రాశి వారు సాధారణంగా కలుపుగోలుగా ఉంటారు. కొత్త వ్యక్తులతో కూడా త్వరగా పరిచయం ఏర్పరచుకోగలుగుతారు. ఇంట్లోనే కాకుండా బయట కూడా వీరి మాటతీరును చాలామంది ఇష్టపడతారని జ్యోతిష్య విశ్లేషణలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

కన్య రాశి

కన్య రాశి వారు కూడా బుధుడి ప్రభావంలో ఉంటారు. అందువల్ల వీరి మాటల్లో స్పష్టత, తెలివితేటలు, ఆలోచనాత్మకత కనిపిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఎదుటివారిని బాధపెట్టకుండా తమ అభిప్రాయాన్ని చెప్పగలగడం వీరి ప్రత్యేకత. ఏ విషయమైనా ముందుగా ఆలోచించి, దాని గురించి పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మాట్లాడటం వీరి స్వభావంగా ఉంటుంది. కన్య రాశి వారి సింప్లిసిటీ, సానుకూల ఆలోచనా విధానం ఇతరులను ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. వీరి అభిప్రాయాలను, ఆలోచనా విధానాన్ని ఇతరులు గౌరవిస్తారని జ్యోతిష్య విశ్వాసం.

(గమనిక: ఈ కథనంలోని వివరాలు జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న సాధారణ నమ్మకాలు, రాశి ఆధారిత విశ్లేషణలపై ఆధారపడి ఉన్నాయి. వ్యక్తిగత జాతకంలోని గ్రహస్థితులు, లగ్నం, దశలు తదితర అంశాల ఆధారంగా ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు.)

Follow Us
మాటలతోనే మాయ చేస్తారు..! కమ్యూనికేషన్ పవర్‌తో మెరిసే రాశులివే..
మాటలతోనే మాయ చేస్తారు..! కమ్యూనికేషన్ పవర్‌తో మెరిసే రాశులివే..
తలపొగరు చూపించిన హీరోయిన్.. డైరెక్టర్ ఏం చేశాడంటే
తలపొగరు చూపించిన హీరోయిన్.. డైరెక్టర్ ఏం చేశాడంటే
అసలైన స్మోకీ ఫ్లేవర్‌తో అద్భుతమైన కోడి కూర.. ఇలా వండండి..
అసలైన స్మోకీ ఫ్లేవర్‌తో అద్భుతమైన కోడి కూర.. ఇలా వండండి..
పక్కకు తిరిగి పడుకుంటే ఏమవుతుంది? ఎలా నిద్రపోతే ఆరోగ్యానికి..
పక్కకు తిరిగి పడుకుంటే ఏమవుతుంది? ఎలా నిద్రపోతే ఆరోగ్యానికి..
డ్యూప్లెక్స్ ఇంట్లో బయటపడ్డ ఏడాది నాటి అస్థిపంజరం!
డ్యూప్లెక్స్ ఇంట్లో బయటపడ్డ ఏడాది నాటి అస్థిపంజరం!
అజ్ఞాత వీరుల అద్భుతమైన కథతో "భారత్ భాగ్య విధాత"..
అజ్ఞాత వీరుల అద్భుతమైన కథతో
రవి కటాకంతో ఈ రాశుల వారికి ధనలాభం, ఉద్యోగ యోగం..!
రవి కటాకంతో ఈ రాశుల వారికి ధనలాభం, ఉద్యోగ యోగం..!
ఒకే ఒక్క స్పూన్ చాలు.. దెబ్బకు షుగర్, నరాల వీక్ నెస్ సెట్టు
ఒకే ఒక్క స్పూన్ చాలు.. దెబ్బకు షుగర్, నరాల వీక్ నెస్ సెట్టు
బీఎండబ్ల్యూ బైక్‌పై ఉబర్ రైడర్!జెన్‌జీ మాట, బిజినెస్ ఫౌండర్‌ ఫిదా
బీఎండబ్ల్యూ బైక్‌పై ఉబర్ రైడర్!జెన్‌జీ మాట, బిజినెస్ ఫౌండర్‌ ఫిదా
అలా అయితే వీలునామా చెల్లదా.. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల ఆస్తి..
అలా అయితే వీలునామా చెల్లదా.. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల ఆస్తి..