మరోసారి ఇంద్రగంటి డైరెక్షన్‌లో సుధీర్ బాబు…రొమాంటిక్ డ్రామాగా ఆడియెన్స్ ముందుకు !
యంగ్ హీరో సుధీర్ బాబు జోరు పెంచారు. ఇటీవలే 'పలాస' దర్శకుడు కరుణ కుమార్‌తో శ్రీదేవి సోడా సెంటర్ సినిమాను అనౌన్స్ చేసిన సధీర్..తాజాగా మరో ప్రాజెక్ట్ ప్రకటించాడు.
యంగ్ హీరో సుధీర్ బాబు జోరు పెంచారు. ఇటీవలే ‘పలాస’ దర్శకుడు కరుణ కుమార్‌తో శ్రీదేవి సోడా సెంటర్ సినిమాను అనౌన్స్ చేసిన సధీర్..తాజాగా మరో ప్రాజెక్ట్ ప్రకటించాడు. టాలెంటెడ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణతో మరో సినిమా చేయబోతున్నాడు ఈ యంగ్ హీరో. వీరిద్దరి కాంబోలో రాబోయే చిత్రాన్ని దీపావళి కానుకగా అధికారికంగా ప్రకటించారు. గతంలో వీరిద్దరి కాంబోలో ”సమ్మోహనం, V” సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే
సుధీర్ బాబు కోసం డిఫరెంట్ స్టోరీ రెడీ చేసిన డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ.. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని ప్రణాళికలు రచిస్తున్నారట. బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1గా ఈ చిత్రం రూపొందనుంది. చిత్రంలో సుధీర్ బాబు సరసన ‘ఉప్పెన’ లో నటించిన క్రితి శెట్టి హీరోయిన్‌గా నటించనుంది. వివేక్ సాగర్ మ్యూజిక్ అందించబోతున్నారు.
రొమాంటిక్ డ్రామాగా ఆడియెన్స్ ముందుకు తీసుకురానున్న ఈ మూవీపై అటు ఇంద్రగంటి, ఇటు సుధీర్ బాబు స్పెషల్ ఫోకస్ పెట్టనున్నారట. అదేవిధంగా ఈ మూవీ లిరిక్స్‌పై ప్రత్యేక శ్రద్ద పెట్టిన ఇంద్రగంటి.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి, రామ జోగయ్య శాస్త్రిలకు ఆ బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. సుధీర్ బాబు కెరీర్‌లో 14వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్ మీదకు రానుంది. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనుంది చిత్రయూనిట్.
We are overjoyed to announce our PRODUCTION NO 1 #Sudheer14, directed by the visionary #MohanaKrishnaIndraganti Sir, starring the stellar actor @isudheerbabu and latest sensation @iamkrithishetty@mahendra7997 @kiranballapalli @pgvinda #VivekSagar #RRaveendar#MarthandKVenkatesh pic.twitter.com/woTjaGHbNb
— Benchmark Studios (@benchmarkstudi5) November 14, 2020
Also Read :
అక్రమ సంబంధం : భర్తను వదిలేసింది, నాలుగేళ్ల కుమారుడిని చంపేసింది
హైదరాబాద్‌లో పండుగ పూట రెచ్చిపోయిన దొంగలు..రూ.40 లక్షల విలువైన సెల్‌ఫోన్లను దోచేశారు
. మేడపై నుంచి 14 రోజుల బిడ్డను కిందకు పడేసిన తల్లి..కనీసం కడుపు తీపి లేకుండా..?